id stringlengths 1 4 | poem stringlengths 71 312 | label int64 0 7 | label_name stringclasses 8
values |
|---|---|---|---|
2110 | నరసింహ! నే నిన్ను నమ్మినందుకుఁ జాల - నెనరు నాయందుంచు నెమ్మనమున
నన్ని వస్తువులు నిన్నడిగి వేసటపుట్టె - నింకనైనఁ గటాక్షమియ్యవయ్య
సంతసంబున నన్ను స్వర్గమందే యుంచు - భూమియందే యుంచు భోగిశయన!
నయముగా వైకుంఠనగరమందే యుంచు - నరకమందే యుంచు నళిననాభ! | 3 | seesamu |
4348 | గురుపదాంబుజముల భక్తి కుదిరి తమ్ముఁ । దా మెఱుంగక ముక్తి లేదవనియందు
మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల! | 2 | teytageethi |
1889 | పలుమారు నే వచ్చి ప్రార్థించి పిలిచిన పలుకవదేమిరా పంకజాక్షయలివేణి మీయింతి యాడిన మాటలు మరుతునా యిక నేను మందయానఇంతుల మాటల కెగ్గులెంతురె దయాపరుడవై ఇటు బల్క బాడియగునెవలపెఱుంగక విభుని వాదుకు దీసుట రమణికి దగునే యో రామ చెపుమ | 3 | seesamu |
1183 | సత్తువగల యాతని పై
నెత్తిన దుర్బలుఁడు తస్కరించిన నతండున్
విత్తముఁ గోల్పడు నతఁడును
జిత్తజ పీడితుఁడు జింతఁ జెందుఁ గుమారా! | 1 | kandamu |
3297 | _x000D_
మేఘ మడ్డమయిన మిహిరుని జెఱచును
_x000D_
జిత్తమడ్డమయిన స్థిరముఁ జెఱచు
_x000D_
పఱుపు లడ్డమైన మఱిముక్తి జెఱచురా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
1618 | నీ మాహాత్మ్యము, నీ రయోపచయమున్, నీ సత్త్వసామగ్రియున్
సామాన్యంబె యొకింత వాయువునకున్, నాగారికిన్ కల్గితే
నేమోకాని తలంప ముజ్జగములం దెవ్వారికిం గల్గదో
హైమాద్రిప్రతిమోన్నతీ! గురుమతీ! అర్కద్యుతీ! మారుతీ! | 7 | saardulamu |
2162 | వేమాఱు నీకథల్ వినుచు నుండెడివాఁడు - పరుల ముచ్చటమీఁద భ్రాంతిపడఁడు
అగణితంబుగ నిన్నుఁ బొగడ నేర్చినవాఁడు - చెడ్డమాటలు నోటఁ జెప్పఁబోఁడు
ఆసక్తిచేత నిన్ననుసరించెడివాఁడు - ధనమదాంధుల వెంటఁ దగులఁబోఁడు
సంతసంబున నిన్ను స్మరణఁ జేసెడివాఁడు - చెలఁగి నీచులపేరుఁ దలఁపఁబోఁడు | 3 | seesamu |
664 | పాపము లొందువేళ రణపన్నగభూత భయజ్వరాదులం
దాపద నొందువేళ భరతాగ్రజ మిమ్ము భజించువారికిం
బ్రాపుగ నీవుఁ దమ్ముఁడిరు ప్రక్కియలంజని తద్విపత్తిసం
తాపముమాన్పి కాతువఁట దాశరథీ! కరుణాపయోనిధీ! | 6 | vutpalamaala |
3734 | _x000D_
ఇంచుకంత యోని కెగసెడు జనములు
_x000D_
కంచముకడ పిల్లి గాచినట్లు
_x000D_
పంచబాణునింటి బానిసె కొడుకులు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
3355 | _x000D_
మాటచెఱపు మూట మర్మము కర్మము
_x000D_
ఆశయ కడగట్టు అప్పుముప్పు
_x000D_
బాస దోస మెన్నఁ బలుకులు ములుకులు
_x000D_
లేశమయినఁ దెలియలేరు వేమా. | 0 | aataveladi |
4106 | _x000D_
మేకఁ జంకఁబెట్టి మెలఁగుచు మందలో
_x000D_
బ్రమసి తిరుగు గొల్లపగిది గాక
_x000D_
దైవ మెఱుఁగక పరదైవముల్ దలఁచును
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
94 | గరువ మేటికి నీ మర్మ మెఱుఁగ రనుచుఁ-దెలిసినమహాత్ములకు నైనఁ దెలియకున్నె
చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ! | 2 | teytageethi |
4355 | అబ్బ మేలోర్వలేనట్టివాఁడైనను । మోహంబుగల తల్లి మూఁగదైన
ఆలు రక్కసియైన నల్లుఁ డనదయైనఁ । గూతురు పెనుఱంకుఁబోతుదైనఁ
గొడుకు తుందుడుకైనఁ గోడలు దొంగైనఁ । దనకు సాధ్యుఁడుగాని తమ్ముఁడైన
గృహకృత్యములు పొరుగిండ్ల వెంబడిఁ బోయి । చెప్పి యేడ్చెడు చెడ్డచెల్లెలైన | 3 | seesamu |
1575 | "ఖల దైత్యాధమ! జానకీసతిని నీ కంఠస్థశాతాసిగాఁ
దలపై బడ్డ మహాశనిచ్ఛదముగాఁ దాలుస్థితోద్యద్ధలా
హలముంగా వసనాంచలగ్రథిత దీప్తాగ్నిస్ఫులింగంబుగా
తలప న్నేరక దెచ్చి తీ" వని రహిన్ దర్జింపవే మారుతీ! | 4 | mattebhamu |
3741 | _x000D_
తలి గర్భమందుఁ దాఁబుట్టి నప్పుడు
_x000D_
మొదల బట్ట లేదు తుదను లేదు
_x000D_
నడుమ బట్టగట్ట నగుఁబాటు గాదటో
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
2923 | నీ కడకంటిచే హరిణి నీ కనుసైగలఁ జిత్రరేఖయున్
నీ కళ చేత హేమగతి నీ లలితోరుల కాంతి రంభ నీ
శ్రీకరబాలలీల శశిరేఖయు నీరసవృత్తిఁ జెందుటన్
నీ కెనరారు దేవతరుణీమణులయినను సుందరీమణీ! | 6 | vutpalamaala |
3997 | _x000D_
జనుఁడు తెలివినొంద చంచలింపదు మది
_x000D_
దయయు దైవమొగిని దగులు బుద్ధి
_x000D_
తివురుభానుఁ జూచి తిమిరంబు నిలుచునా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
3488 | _x000D_
నాదబిందుకళల నయమొంది యాత్మ
_x000D_
యం దంటి చపలచిత్త మమర నిల్పి
_x000D_
బ్రహ్మరంధ్రమునను బ్రబలిన యోగిరా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
2404 | నిత్యానిత్యము లెఱుఁగక
నిత్యముఁ జేపట్టుబుధుల నిందించిన నా
మృత్యువుపా లౌ మర్తుఁడు
సత్యం బిది వినగదన్న సంపఁగిమన్నా! | 1 | kandamu |
1729 | శ్రీరుక్మిణీనాథ జితకోటిరతినాథ సుందరాకార సానంద శరణుసురయక్షకిన్నరవరమౌనిశుభకర నరకాంతకా పద్మనాభ శరణుజలధరనిభగాత్ర జలజాతదళనేత్ర పరమపవిత్ర గోపాల శరణునిర్మలగుణతోష నిజభక్తజనపోషక వివచోభూషప్రకాశ శరణు | 3 | seesamu |
1639 | మోద మెలర్పఁగా దనయమోహము చేతను బిప్పలద్రు నా-
గాది ప్రతిష్ఠలెల్ల జనులందఱు సంతసమందఁ జేయుచో,
బేదఱికం బదెంత మఱి బిడ్డలు గల్గినఁ జాలునంచు నా-
పాదన జేయుచో నెపుడుఁ బల్కెడు తల్లినిఁ బోలరెవ్వరున్. | 6 | vutpalamaala |
1853 | వనజాక్షి నెరనీటు వగలు చూచిన మది నిలువ నోపగరాదు నీరజాక్షకనకాంగి నెమ్మెయికాంతి జూచినయపుడె తమి నిల్ప వశమౌనె దానవారిమగువ జిలిబిలి ముద్దుమాటలాలించిన నాశ మాన్ప దరంబె యమరవంద్యశిబ్బెంపుగుబ్బల చిత్రంబు జూచిన మోహంబు మానునే మోహనాంగ | 3 | seesamu |
3276 | _x000D_
చదువులఁ జదివినవారలు
_x000D_
పదవిన్ని బొందంగ లేరు పరమార్థముగాఁ
_x000D_
బెదవులఁ గదలక యుండిన
_x000D_
మదిలో నది రాజయోగమహిమము వేమా. | 1 | kandamu |
1897 | వలరాజుమామ జక్కులరేనిచెలికానితలపువ్వు కలువల చెలిమికాడుఱిక్కలగమికాడు జక్కులపగవాడు వారధిపట్టి భావజునిమామతిమిరబృందంబుల దెగటార్చు మగవాడు వలమురిదాల్పుముద్దులమరందిగగనేభ మెక్కి వేగ చరించు రేరాజు విరహులపాలిటి వెడదచిచ్చు | 3 | seesamu |
968 | భూతలంబునఁ గలిదోషహేతుకమునఁ | బ్రబలురై రింకనేమి చెప్పంగవలయు
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 2 | teytageethi |
1201 | పాపంబులందు నెక్కుడు
పాపములు సుమీ! ధరిత్రి పై క్రోధగుణం
బేపారు లోభమును నివి
యేపురుషులఁ జెందఁగూడ దిలను గుమారా! | 1 | kandamu |
2644 | "అమ్మా! యయ్య!" యటంచునెవ్వరిని నేనన్నన్శివా! నిన్ను నే
సుమ్మీ నీ మదిఁ తల్లిదండ్రులనటంచు న్జూడఁగాఁబోకు నా
కిమ్మైఁ దల్లియు దండ్రియున్ గురుఁడు నీవేకాన సంసారపుం
జిమ్మంజీకటిఁగప్పిన\న్ గడుపు నన్ శ్రీకాళహస్తీశ్వరా! | 7 | saardulamu |
979 | బోలెఁడు గందంబు బొమలదాఁకా మెత్తి | మెంటెఁ డీబూడిద ఒంట బామి
రుదురాకపేర్లు జన్నిదములు మోఁకాలి | లాపున దిగయేసి యావుపాస-
నానికి నేతిదారైనను దెమ్మంట | దాఁ బల్కునెడ నమేద్యాలటంట
పచ్చాలు మాలయ్యపచ్చాలుననుకొంట | సంకలో కబ్బాలు సప్పుకొంట | 3 | seesamu |
169 | నీ శాంతి యంభోధి నిర్భరాంబువులు బా- ణముఖంబునకుఁ దెచ్చు నాఁడె తెలిసె
నీ కోప మరి రావణైకానుజన్ము నా- నగరి రాజుగఁ జేయు నాఁడె తెలిసె
నీ కీర్తి కపటదుర్నితుఁడౌ ధ్వాంక్షదా- నవు తప్పుఁ గాచిన నాఁడె తెలిసె
నీయభిజ్ఞత యవినిందిత నీతన్వి- నగ్నినిఁ జొరు మన్న యపుడె తెలిసె | 3 | seesamu |
1679 | తలఁపున నున్న భావ మొకదారిఁ జెలంగఁగ వచ్చిరాని మా-
టలు మఱి పల్కువేళఁ గడు ఠాయి జెలంగెడు శౌరిసత్కథా-
కలితవినోదముల్ వినెడు కైవడిగా వడి నాలకించుచో
ఫల మొనఁగూడెనంచు నుతిఁ బల్కెడు తల్లినిఁ బోలరెవ్వరున్. | 5 | champakamaala |
1811 | గజయాన వగమీర గదిసి నాథుని యెద కులుకుగుబ్బలచేత గ్రుమ్మి వేగబదపడి చేతుల వదలక బిగబట్టి గుదిగాళ్లు వెన్నున గూర్చి వొక్కిమరుకేళి నొకవింత మనసిచ్చి యొక కొంతసేపు హాయిగ రతిచెంది మగనిమదికింపు పుట్టింప సదయుని మెప్పించి సుదతి నాథుని మోము జూచి తమిని | 3 | seesamu |
2755 | ఎప్పుడుఁ దప్పులు వెదకెడు
నప్పురుషునిఁ గొల్వఁగూడ దది యెట్లన్నన్
సర్పంబు పడగ నీడను
గప్ప వసించిన విధంబు గదరా సుమతీ! | 1 | kandamu |
4344 | శతకోటిసారస హితుల మించిన వెల్గు । మేరువు శిఖరంబుమీఁది వెల్గు
మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల! | 2 | teytageethi |
11 | ఇంద్రనీలచ్ఛాయ లీను నెమ్మేనిపైఁ- గనకాంబరప్రభ గ్రందుకొనఁగఁ
బర్వసుధాంశు శోభసముజ్జ్వలవక్త్ర- మున నూర్ధ్వపుండ్రము ముద్దు గుల్క
నెగుభుజంబుల ధగద్ధగితాంగద ద్యుతుల్- మూర్ధరత్నకిరీటమునఁ జరింప
వర్ణితోరస్థలి వైయంతిక కౌస్తు- భాంతర శ్రీదేవియంద మమర | 3 | seesamu |
3788 | _x000D_
కొట్టినఁ దిట్టినఁ గాని
_x000D_
కట్టు బిగించినను గాని కరకరి సేయ\న్
_x000D_
కట్టడివడి యన కుండును
_x000D_
దిట్ట మదిని శివుని దలఁప దీరదు వేమా. | 1 | kandamu |
445 | కాని ప్రయోజనంబు సమకట్టదు తా భువి నెంత విద్యవాఁ
డైనను దొడ్డరాజు కొడుకైన నదెట్లు; మహేశుపట్టి వి
ద్యానిధి సర్వవిద్యలకు, దానె గురుండు వినాయకుండు దా
నేనుఁగు రీతి నుండియు నదేమిటి కాడఁడు పెండ్లి? భాస్కరా! | 6 | vutpalamaala |
1991 | అల నీటం దగురొంపిపైఁ జిలికిన న్నానీటనే పాయు నా
యిల పాపంబులు దుర్భరత్వము మహాహేయంబునం బొందినం
బలువై జీవుని దొప్పఁదోఁగినవి యీబాహ్యంబునం బాయునే
పొలియుం గాక భవత్సుపాదజలముం బ్రోక్షింప నారాయణా! | 4 | mattebhamu |
1398 | సమయమెరుగని పనులివి సరసమగునె । పరులు గనుగొన్న నగరె మీ పనులటంచు
కసరి నలుగుడునాటి చక్కన దలంప । వశమటే రామరామ లావణ్యసీమ. | 2 | teytageethi |
1068 | సద్గురుకృపాకటాక్షవీక్షణము వలన | బ్రాకృతుఁడు జ్ఞానియై ముక్తిపదము గాంచు,
భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ! | 2 | teytageethi |
4199 | _x000D_
వాడవదినెకేల వావివర్తనములు
_x000D_
చాడివాని కేల జాడబుద్ధి
_x000D_
మూఢసతులకేల ముదముతో జ్ఞానంబు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
2955 | నెన్ని సొమ్ములునైన నేనిత్తు నీకు | నా పతిని జూచినంతనె నయముమీఱతరుణి నీవేగి యిచటికి తాడిమళ్ళ | రాజగోపాలు దేగదే రాజవదన. | 2 | teytageethi |
4316 | కదిసిన సేసము తైముల కంఠసరుల్ ఘనరత్న కంకణాం
గదరశనా ... ... నికాయము శ్రీయలమేలుమంగకు\న్
బొదివి వివాహవేళ దిగఁ బోసిన ముత్తెపుఁ బ్రాల నందమై
ముదమగు నీకుఁ గన్నుఁగవ ముందఱ నెప్పుడు వేంకటేశ్వరా! | 5 | champakamaala |
4588 | సురవరమల్ల! మల్లవిత సూత్రసుధాంబుధిఖేల! ఖేలసం
గర కలకంఠ! కంఠమణినాయకభీమభుజంగ! జంగమ
స్థిరతరనాథ! నాథక నిధీకృతరూప! విరూప సమ్మతా
వర! కరుణాబ్ధి! ప్రోవు బసవా! బసవా! బసవా! వృషాధిపా! | 5 | champakamaala |
1348 | కులికి దిగ్గున లేచి లోకొంగు జూచి । చెరగు మాసె నటంచును సిగ్గుదోచి
పాత్ర గైకొన్న హొయలెంచి బాళి నిలుప । వశమటే రామరామ లావణ్యసీమ. | 2 | teytageethi |
3891 | _x000D_
తనలో సర్వంబుండఁగ
_x000D_
తనలోపల వెదుకలేక ధరవెదకెడు నీ
_x000D_
తనువుల మోసెడి యెద్దుల
_x000D_
మనములఁ దెల్పఁగ వశమె మహిలో వేమా. | 1 | kandamu |
2903 | నీ కటిపెంపుచేత ధరణీతలమున్ వశమయ్యె కోమలీ
నీ కుచకుంభయుగ్మమున నిర్జితమయ్యె సురాలయం బహో
చేకొనఁగల్గె నీదు జడచే నహిధామము నిన్నుఁ గూడి ము-
ల్లోకము లేలినట్లు మదిలో ముదమందుదు సుందరీమణీ! | 6 | vutpalamaala |
1691 | సదమలరీతు లుల్లసిల సార మెఱింగెడి రీతిఁ జక్కఁగాఁ
జదివితివేని భూజనులు సన్నుతి చేసెద రింతెకాక సం-
పద లెడఁగూడు నీ కనుచు బాలునకు న్మఱి బుద్ధి చెప్పుచో
మది ముదమంది యొప్పెసఁగు మానినిఁ దల్లినిఁ బోలరెవ్వరున్. | 5 | champakamaala |
2429 | భ్రమదృశ్యజాల మెల్లను
భ్రమ లోకములెల్ల మిగుల భ్రమ కర్మంబున్
భ్రమమూలమె యీసర్వము
సమరసమౌ దత్త్వ మెన్న సంపఁగిమన్నా! | 1 | kandamu |
4253 | కుంకుమకస్తురీ ప్రభ బుగుల్కొనఁ జెక్కుల జాఱ దివ్యతా
టంకమణిప్రభాప్రతివిడంబముతో నలమేలుమంగ భ్రూ
జంకెల నందలింపఁగనె జల్లనెఁ జిత్తము నీకు నంతలో
నంకన మించు మిమ్ముఁ బులకాంకురకోటులు వేంకటేశ్వరా! | 6 | vutpalamaala |
4623 | భీమగజంబు డీకొనిన బిట్టరఁజంపుడు బిజ్జలేంద్రుఁడు
ద్దామతఁ దక్కి మ్రొక్కుటయుఁ దత్కరినెత్తిన విక్రమోద్ధతుం
డా మడివాలు మాచయకు నగ్గలమైన మహానుభావ! నా
స్వామివి నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా! | 6 | vutpalamaala |
2409 | జడివాన కురిసినట్టులు
విడువక వాదింతు రాత్మవేత్తల మనుచున్
గుడియెడ మెఱుఁగనిమాటల
జడమతు లిలఁ గొంద ఱన్న సంపఁగిమన్నా! | 1 | kandamu |
3299 | _x000D_
వెదకి కానలేఁడు వేదాంతవేద్యుని
_x000D_
తత్వవేత్తలేఁడు ధరణిలోనఁ
_x000D_
గలిగెనేని యతఁడు కనఁబోఁడు మఱివేఱె
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
3833 | _x000D_
పూర్ణమైన తనదు భుజబల్మిఁ జూడక
_x000D_
భువిని చెడుగుతోడ పోరరాదు
_x000D_
పాలకుండ కింత పొలసినా సారాయి
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
2230 | అమరేంద్రవినుత! నిన్ననుసరించినవారు - ముక్తిఁ బొందిరి వేగ ముదముతోడ
నీ పాదపద్మముల్ నెఱ నమ్మియున్నాను - నాకు మోక్షంబిమ్ము నళిననేత్ర!
కాచి రక్షించు నన్ గడతేర్చు వేగమే - నీ సేవకునిఁ జేయు నిశ్చయముగఁ
గాపాడినను నీకుఁ గైంకర్యపరుఁడనై - చెలఁగి నీ పనులను జేయువాఁడ | 3 | seesamu |
2795 | ధనపతి సఖుఁడై యుండియు
నెనయంగా శివుఁడు భిక్ష మెత్తఁగవలసెన్
దనవారి కెంత కలగినఁ
దనభాగ్యమె తనకుఁగాక తథ్యము సుమతీ! | 1 | kandamu |
2082 | ఉర్విలో నాయుష్యమున్న పర్యంతంబు - మాయ సంసారంబు మఱగి నరుఁడు
సకల పాపములైన సంగ్రహించును గాని - నిన్నుఁ జేరెడి యుక్తినేర్వలేఁడు
తుదకుఁ గాలునియొద్ద దూత లిద్దఱు వచ్చి - గుంజుక చనివారు గ్రుద్దుచుండ
హింస కోర్వఁగలేక యేడ్చి గంతులువేసి - దిక్కు లేదని నాల్గుదిశలు చూడఁ | 3 | seesamu |
3617 | _x000D_
జాతులందు మిగుల జాతి యే దెక్కువో
_x000D_
యెఱుక లేక తిరుగు నేమిఫలము
_x000D_
ఎఱుక గలుగువాఁడె హెచ్చైన కులజుండు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
3732 | _x000D_
యోనియందె పుట్టి యోనికి రుచిఁజేయు
_x000D_
చన్నుగుడిచి పెరిగి చన్నుఁబట్టు
_x000D_
సృష్టిలోన నడఁగు సిగ్గెఱుగని జీవి
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
1196 | విను ప్రాణరక్షణమునన్
ధనమంతయు మునిగిఁపోవు తఱిఁ బరిణయమం
దున గురుకార్యమున వధూ
జన సంఘములందు బొంకఁ జనును గుమారా! | 1 | kandamu |
2298 | సకృపాలోకన! నందగోపుని తనూజాతుండవై గొల్లవై
సకలక్షోణుల నేలినాఁడవఁట, మించం గశ్యపబ్రహ్మ గ
న్న కుమారుండన మిన్నుముట్టి కుఱుచై నాఁడేల నాడేల నే
రక దానంబుగ వేఁడుకొంటి రఘువీరా! జానకీనాయకా! | 4 | mattebhamu |
4090 | _x000D_
ద్రోహబుద్ధినైన దొంగఱికమునైన
_x000D_
నటననైన సాహసముననైన
_x000D_
సంపదధికునుండి సాధించి ధనమును
_x000D_
బడుగు కిచ్చి బాగుపడును వేమ. | 0 | aataveladi |
584 | సరయువు గృష్ణ నర్మదయు జాహ్నవి బాహుద తుంగభద్ర భా-
స్కరసుతయు న్సరస్వతియు గౌతమియుం మొదలైన దివ్యని-
ర్ఝరులను మున్గు పుణ్య మొకసారె శివా యనినన్ లభించుఁబో
చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా! | 5 | champakamaala |
1560 | అతిసూక్ష్మాంగుఁడ వీవు ననుఁ గొని యీయంభోనిధిం దాటి యే
గతి పోవంగలవంచు సీత పలుకం గౌతూహలం బొప్ప న
ప్రతిమానామర శైలసన్నిభ శరీరం బర్మిలిం జూపి యా
క్షితికన్యామణి కద్భుతంబు ముదముం గీల్కొల్పవే మారుతీ! | 4 | mattebhamu |
2430 | వంశము తన కెక్కడిది చి
దంశము లౌఁ గాకయున్నఁ గద జీవులకున్
సంశుద్ధి దొరకనేరదు
సంశయములు విడువకున్న సంపఁగిమన్నా! | 1 | kandamu |
256 | అదన న్వేఁడిన యాచకప్రతతి కీయంగావలెన్ రొక్కమిం-
పొదవన్ మీ కథలాలకింపవలె మేనుప్పొంగ గంగామహా-
నదిలో స్నానము లాచరింపవలె హీనప్రక్రియ న్మాని స-
మ్మదచిత్తంబున మర్త్యుఁడెల్లపుడు రామా! భక్తమందారమా! | 4 | mattebhamu |
3754 | _x000D_
కాలు చేయి లేదు కంచుకంబు గలదు
_x000D_
కొమ్మ లేదు ఉరికి చిమ్ము వేగ
_x000D_
గరిడిలేక చంపుఁగడు పెద్దచోద్యమౌ
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
766 | ధరలో గోళకుఁ డైనపాండునికళత్రం బందు వేర్వేఱనే
వురకు\న్ బుట్టినపాండునందనులు దివ్యుల్మెచ్చ వర్తింపఁ ద
చ్చరితం బంతయు భారతంబని ప్రశస్తంబయ్యె నీనామసం
స్మరణప్రౌఢిమఁ గాదె యీఘనత కృష్ణా దేవకీనందనా. | 4 | mattebhamu |
2645 | కొడుకుల్ పుట్టరటంచు నేడ్తురవివేకు ల్జీవనభ్రాంతులై
కొడుకుల్ పుట్టరె కౌరవేంద్రున కనేకుల్ వారిచే నేగతుల్
వడసెం బుత్త్రులులేని యా శుకునకున్ బాటిల్లెనే దుర్గతుల్
చెడునే మోక్షపదం బపుత్త్రకునకున్ శ్రీకాళహస్తీశ్వరా! | 4 | mattebhamu |
845 | అంసాలంబితకుండల
కంసాంతక నీవు ద్వారకాపురిలోన\న్
సంసారి రీతినుండి ప్ర
శంసార్హుఁడ వైతి వహహ జగతిని గృష్ణా. | 1 | kandamu |
4510 | ప్రబలపాతకపూర్ణుఁ డల్పంపు సుకృత- । మునను శుద్ధుండు గాకుండుననుట నిక్క-
మాడు గాకేమి యిచ్చకం బనృతవాది
మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల! | 2 | teytageethi |
3167 | _x000D_
శివుని యనుభవంబు సృష్టిలోపల లేక
_x000D_
సంశయంబు చెడదు సాధకులకు
_x000D_
చెలగుఁదివ్వె లేక చీఁకటిపాయునా?
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
3154 | _x000D_
సత్య మమరియుండ జ్ఞాన మమరియుండు
_x000D_
జ్ఞాన మమరియుండ సత్యముండు
_x000D_
జ్ఞానసత్యములును సమమయిన ద్విజుఁడగు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
953 | దశశతాబ్దముల నిన్ దవిలి పూజించిన | మెచ్చి చక్రికిఁ జక్రమిచ్చినావు
తరలక నిను గూర్చి తప్పమొనర్చిన క్రీడి | కెసఁగఁ బాశుపతాస్త్ర మొసఁగినావు
మిత్తి చేఁ బడి నిన్ను హత్తి బత్తిఁ దలంచు | మునిపుత్రుఁ జేపట్టి మనిచినావు
కాలకూటాగ్నిచేఁ గ్రాఁగి కుయ్యిడుచున్న | దివిజుల యాపదన్ తీర్చినావు | 3 | seesamu |
1708 | పరనిరతోపకారమృదుభాషణభూషణుఁ డాశ్రితావన-
స్థిరగుణశాలి నీతిపథజీవనజీవనుఁ డుత్తమాధమాం-
తరము లెఱుంగు మేటి తలిదండ్రులకు న్జవదాఁటఁడన్నచో
నరసి మనంబులోన ముదమందెడు తల్లినిఁ బోలరెవ్వరున్. | 5 | champakamaala |
2628 | వీడెంబబ్బినయప్పుడుం దమ నుతుల్విన్నప్పుడుం బొట్టలోఁ
గూడున్నప్పుడు శ్రీవిలాసములుపైకొన్నప్పుడుం గాయకుల్
పాడంగా వినునప్పుడు\న్ జెలగు దంభప్రాయవిశ్రాణన
క్రీడాసక్తుల నేమి చెప్పవలెనో శ్రీకాళహస్తీశ్వరా! | 7 | saardulamu |
1134 | బూటకపు వర్తనముఁ గని,
జూటరి వీఁడనుచుఁ దప్పఁ జూతురుగా! యా
బాటను విడి సత్యము మది
పాటించి నటించువాఁడె నరుఁడు కుమారా! | 1 | kandamu |
1784 | ... ... ... ...యట్టి విరిబోడి నేలుట యర్హమగును | మదనగోపాల సత్యభామావిలోల! | 2 | teytageethi |
462 | తనకు ఫలంబు లేదని యెదం దలపోయఁడు కీర్తి గోరు నా
ఘన గుణశాలి లోకహిత కార్యము మిక్కిలి భారమైన మే
లనుకొని పూను; శేషుఁడు సహస్ర ముఖంబుల గాలి గ్రోలి తా
ననిశము మోవఁడే మఱి మహాభరమైన ధరిత్రి భాస్కరా! | 5 | champakamaala |
1268 | చెప్పినఁ జెప్పక యుండినఁ
దప్పక సేయంగవలయుఁ దనపనులెల్లన్
మెప్పొదవఁగాను లేదా
ముప్పొదవును గాదె యెందు ముద్దు కుమారీ! | 1 | kandamu |
4427 | పూపొదలో దాఁగి పులి యున్నరీతిని । మొగిలిరేకున ముండ్లు మొలచినట్లు
నందనవనములో నాగుఁబామున్నట్లు । చందురునకు నల్పు చెందినట్లు
సొగసైన లేమకు సెగరోగమున్నట్లు । మృగనాభిలోఁ బిప్పి తగిలినట్లు
జలధిలోన విషంబు సంభవంబైనట్లు । కమలాప్తునకు శని గలిగినట్లు
పద్మరాగమునకుఁ బటలమేర్పడినట్లు । బుగ్గవాకిటి చుట్టు పుట్టినట్లు | 3 | seesamu |
3295 | _x000D_
ఇంతకాలముండి యెఱుకమాలినజీవి
_x000D_
చచ్చిపుట్టుచుండు సహజమనుచు
_x000D_
నెఱుక మఱచుచోట నెఱుఁగునా బ్రహ్మంబు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
2468 | పాపపువాసనవిషయము
కాపాడుచురాగ నరుఁడు గడఁవగఁగలఁడా?
యేపట్టున గుహ్యోదర
చాపల్యము మానకున్న సంపఁగిమన్నా! | 1 | kandamu |
3845 | _x000D_
ఎట్టిరూపుఁ జూడ నీరూపు కనిపించు
_x000D_
నీదురూపుఁజూడ నెగడుఁ దెలివి
_x000D_
హెచ్చు తెలివి యున్న నీశ్వరుఁ డేతోఁచు
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
316 | శుక శాండిల్య మృకండుజాత్రి కలశీసూనుల్ భరద్వాజ శౌ-
నక వాల్మీకి వసిష్ఠ గర్గ భృగు మాండవ్యాజసంభూత కౌ-
శిక కణ్వాది మహర్షిశేఖరులు నిన్ జింతింపఁగా లేరు, కొం-
కక నేనెంతటివాఁడ నిన్బొగడ భర్గా! పార్వతీవల్లభా! | 4 | mattebhamu |
4280 | దొరలిన మేనిగందపొడిధూళి వసంతము ఘర్మవారిపైఁ
జఱచినపువ్వుఁదేనెల వసంతము నీ కలమేలుమంగకున్
నెఱసి కరంగు చిత్తముల నీళ్లవసంతము మీకు మీకు నీ
యొఱపులు నీప్రియంబులు మహోన్నతు లెట్టివో వేంకటేశ్వరా! | 5 | champakamaala |
27 | తగునట్లు తిరుమేను తా నామతింపుచు- మిన్న పీతాంబరం బున్న దనుచుఁ
గమలతోఁ బుట్టిన కౌస్తుభం బది పోవఁ- దక్కు సొమ్మది నీకు తక్కె ననుచు
లలితరత్న ద్యుతి మొలచినట్లు కిరీట- ముత్తమాంగముఁ బాయ కున్న దనుచు
మండితమాణిక్యకుండలంబులు కర్ణ- యుగళితోఁ బుట్టిన ట్లున్న వనుచు | 3 | seesamu |
2336 | ధర కల్పాంతమునం గరంగఁబడి పాతాళంబులోనంటినన్
దొరయం దొల్లిటియట్ల కా నిలుప నుద్యోగించి క్రోడంబవై
పొరి నబ్భూతలమెత్తినట్టి ఘనదర్పున్ నిన్ను భావింతు ని
ర్భరకారుణ్య నిరూఢచిత్త! రఘువీరా! జానకీనాయకా! | 4 | mattebhamu |
4062 | _x000D_
అధికజనులతోడ నాప్తులతోడను
_x000D_
పరువు గురు తెఱింగి పలుకకున్న
_x000D_
వచ్చు చెడ్డతనము హెచ్చుగా గాంభీర్య
_x000D_
హానిచెందుఁ దనకు నపుడు వేమ. | 0 | aataveladi |
3074 | నిన్నుఁ జూచె నేని తన్నుఁ దా మఱచును
తన్నుఁ జూచె నేని నిన్ను మఱచు;
నే విధమున జనుఁడు నెఱుగు, నిన్నును దన్ను?
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
2580 | భవదుఃఖార్ణవయానపాత్రము పరబ్రహ్మంబు యోగీంద్రహృ-
ద్భవనప్రస్ఫురితప్రదీపము నఘధ్వాంతార్కబింబం బతి-
శ్రవణానందకరంబు సన్మునిగణస్వాధ్యాయపాఠంబు మీ
శివనామాంకము భక్తపుంగవ సదా సేవ్యంబు సర్వేశ్వరా! | 4 | mattebhamu |
880 | క్రతువులు తీర్థాటనములు
వ్రతములు దానములు సేయ వలెనా లక్ష్మీ
పతి మిముఁ దలచినవారికి
నతులితపుణ్యములు గలుగు టరుదే కృష్ణా. | 1 | kandamu |
1227 | పతి భుజియించిన పాత్రను
మెతు కొక్కటియైన భార్య మెసఁగుటకై తా
హిత మూనకున్న నది యొక
సతియే? కడుఁ బాపజాతి జగతి కుమారీ! | 1 | kandamu |
1411 | మగవారి మాట బూరగపంటి తేటద్ద- । మున గానబడు పైడిమూట దూర-
మగు కొండనున్పు లేనుగదిన్న వెలగకా- । యలు మబ్బులో తళుక్కనెడి మెరుపు
మిద్దెపై పరుగులు మీసాలపై తేనె । పొగ ముల్లెగట్టిన పోల్కె తేట-
నీటిలో జాబిల్లినీడ లేగిన యెండ- । మావులు రతివేళ మరులు సతుల | 3 | seesamu |
1696 | సరసులు మెచ్చఁగా గణితశాస్త్రము నేరిచి సంఖ్యలెల్ల సు-
స్థిరమతితోడఁ జెప్పుటకుఁ దెల్వి వహించినయట్టి మంచిలే-
కరి యగుఁగాక నా సుతశిఖామణి యంచుఁ బరాపరేశు స-
ద్గురునిఁ దలంచుచో నెదను గోరెడు తల్లినిఁ బోలరెవ్వరున్. | 5 | champakamaala |
2711 | ఆరావంబుదయించెఁ దారకముగా నాత్మాభ్రవీధిన్మహా
కారోకారమకార యుక్తమగునోంకారాభిధానంబు చె
న్నారు న్విశ్వమనంగఁ దన్మహిమచే నా నాదబిందుల్సుఖ
శ్రీ రంజిల్లఁగడంగు నీవదె సుమీ శ్రీకాళహస్తీశ్వరా! | 7 | saardulamu |
3612 | _x000D_
వానరాకడ మఱి ప్రాణంబు పోకడ
_x000D_
కానఁబడదు ఘనుని కైనఁగాని
_x000D_
కానఁబడిన మీఁద కలి యిట్లునడుచునా
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
3014 | తప్పక లక్ష్మణుఁ దడయక గాపిడి యేగి మృగమ్మును నేయుతరినిహా లక్ష్మణా యని యా మృగమటు గూయ మగువకు దుఃఖమై మరిది నంపెమారీచు మాటయే మా యన్న గాదని భావించి తమ్ముడు బాసచేసెనాడగూడని మాటలాడగా దలపెట్ట వనితరో తమ్ముడు వచ్చినాడు | 3 | seesamu |
3044 | చిన్నతనమ్మున జిన్నవాండ్రను గూడి బాగుగానుందువే పరమపురుషయవతారమూర్తివం చలివేణులందరున్ భ్రాంతిచేతను నిన్ను బ్రస్తుతింపనా లక్ష్మితోడుత నానందముగ గూడి పొందుగా నుంటివే సుందరాంగరమణులందఱు గూడి రవ్వలు బెట్టిన చెట్ల నెక్కుట నీకు చెల్లమగునె | 3 | seesamu |
21 | భక్తిఁజేసిన శిలాప్రతిమ మాత్రమే కాని- హరి యిందుఁ గలుగునా యనెడువారు
స్వామి యిం దుండిన సత్యంబుఁ జూపక- యుండునే యని పల్కుచుండువారు
బుద్ధావతారంబుఁ బూనినాఁ డఖిలంబుఁ- గని కనన ట్లుండు ననెడువారు
దేవతామహిమంబు దెలియునో యేమేమి- నడువ నున్నదో యని నుడువువారు | 3 | seesamu |
3441 | _x000D_
సిగ్గునేడనుదాగుఁ జీక టేడను దాగు
_x000D_
నాఁకలేడదాగు నాత్మలోన
_x000D_
దాగియున్న నిద్ర దాగుట తెలియుఁడీ
_x000D_
విశ్వదాభిరామ వినర వేమ. | 0 | aataveladi |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.