Translating Classical Poetry into Modern Prose
Paper • 2606.02806 • Published
id stringlengths 1 3 | poem stringlengths 89 220 | label int64 0 6 | label_name stringclasses 7
values |
|---|---|---|---|
252 | దారుణపాత కాబ్ధికి సదా బడబాగ్ని భవాకులార్తివి
స్తారదవానలార్చికి సుధారసవృష్టి దురంత దుర్మతా
చారభయంక రాటవికి జండకఠోరకుఠారధార నీ
తారకనామ మెన్నుకొన దాశరథీ కరుణాపయోనిధీ. | 1 | ఉత్పలమాల |
509 | రావణుచేతి బాధల నిరంతరమున్ బడి వేఁగి, మూఁకలై
దేవత లెల్ల గీష్పతికిఁ దెల్లముగా నెఱిఁగింప, వారి రా
జీవ తనూజుఁ డున్నెడకు శీఘ్రమ తోడ్కొనిపోయి చెప్ప, నా
దేవుఁడు విష్ణు సన్నిధికి దిగ్గనఁ జేకొనిపోయి యచ్చటన్. | 1 | ఉత్పలమాల |
228 | గద సారించి యసహ్యవిక్రమ సమగ్రస్ఫూర్తిచే వేయఁగా
నది దప్పించి వరాహమూర్తి నిజదంష్ట్రాగ్రాహతిం ద్రుంచెఁ బెం
పొదవం గ్రోధమదాతిరేక బలశౌర్యోదార విస్తార సం
పదఁ బంచాస్యము సామజేంద్రుఁ జల మొప్పం ద్రుంచు చందంబునన్. | 3 | మత్తేభము |
68 | మందుని గతి యము నాంబువు
లందు నిసిం గ్రుంకి బద్ధుఁడై చిక్కిన యా
నందుని వరుణుని బంధన
మందు నివృత్తునిగఁ జేసె హరి సదయుండై. | 0 | కందం |
166 | లలిత పతివ్రతామణి విలాసవతీతిలకంబు పార్వతీ
లలన గుమారుఁ గన్నటు సులక్షణ జాంబవతీ లలామ ని
ర్మల గతిఁ గన్న పట్టి సుకుమారతనుండు విరోధిభంజనో
త్కలిక సుఖించునే గుణకదంబుఁడు సాంబుఁడు వృష్ణిపుంగవా! | 2 | చంపకమాల |
102 | సరసిజగర్భ! నీ యెడఁ బ్రసన్నత నొంది మదీయలోక మే
నిరవుగఁ జూపుటెల్లను నహేతుక భూరి దయా కటాక్ష వి
స్ఫురణన కాని, నీ దగు తపోవిభవంబునఁ గాదు; నీ తప
శ్చరణము నాదు వాక్యముల సంగతిఁ గాదె సరోజసంభవా! | 2 | చంపకమాల |
75 | నరక మురప్రలంబ యవనద్విప ముష్టికమల్ల కంసశం
బర శిశుపాల పంచజన పౌండ్రక పల్వల దంతవక్త్ర వా
నర ఖర సాల్వ వత్స బక నాగ విదూరథ రుక్మి కేశి ద
ర్దుర వృష ధేనుక ప్రముఖ దుష్ట నిశాటులఁ ద్రుంచె వ్రేల్మిడిన్. | 2 | చంపకమాల |
56 | ఆ వనమున వసియించి నృ
పావననయశాలి యిచ్చె నభయములు జగ
త్పావన మునిసంతతికిఁ గృ
పావననిధి యైన రామభద్రుం డెలమిన్. | 0 | కందం |
281 | కోతికిశక్యమా యసురకోటుల గెల్వను, గెల్చెబో నిజం
బాతనిమేన శీతకరుడౌట దవానలు డెట్టివింత? మా
సీతపతివ్రతా మహిమ, సేవకు భాగ్యము, మీ కటాక్షమున్
ధాతకు శక్యమా పొగడ? దాశరథీ కరుణాపయోనిధీ. | 1 | ఉత్పలమాల |
403 | బహుళజలప్లవమాన
ద్రుహిణాండము చెమ్మ యుఱికి రూక్షార్కవిభా
రహితతఁ గాటుకపట్టెను
రహి చెడి యన నంధతమసరాసులు బెరసెన్. | 0 | కందం |
533 | కొడు కుదయించె నంచలరి కోరి సుధాంబుధి మిన్ను ముట్టి, య
ప్పుడు జగమెల్లఁ గప్పె ననఁ బూర్ణత నొందెను సాంద్ర చంద్రికల్
పుడమికిఁ బాలవెల్లి గతిఁ బొల్పెసలారఁగఁ జంద్రుఁ డొప్పె, న
య్యుడుపతి మేని మచ్చయును నొప్పెఁ బయోనిధిఁ బద్మనాభుఁడై. | 2 | చంపకమాల |
153 | కూరలుఁ గాయలు నీళ్ళా
హారముగాఁ గొనుచు నియమ మలవడఁగ నసం
స్కారశరీరుం డగుచు ను
దారత నవధూతవేషధరుఁడై వరుసన్. | 0 | కందం |
245 | అగణిత సత్యభాష, శరణాగతపోష, దయాలసజ్ఘరీ
విగత సమస్తదోష, పృథివీసురతోష, త్రిలోక పూత కృ
ద్గగన ధునీ మరంద పదకంజ విశేష మణిప్రభా ధగ
ద్ధగిత విభూష భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ. | 2 | చంపకమాల |
578 | మొగము బిగించి, పాదములు మొత్తముగా వడినూఁది త్రొక్కి, నీ
టుగ మొగమెత్తి, భీకర కఠోర రవంబున నార్చి, బాహు ల
త్యగణిత లీల నూఁచి, వలయంబుగ వాలముఁ ద్రిప్పి, వ్రేఁగునన్
నగము సగమ్ము గ్రుంగఁ, గపి నాథుఁడు నింగికి దాఁటె ఱివ్వునన్. | 2 | చంపకమాల |
295 | ఉపకారికి నుపకారము
విపరీతము గాదు సేయ వివరింపంగా;
అపకారికి నుపకారము
నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ | 0 | కందం |
125 | మనుజేంద్ర! విదురుఁ డంతకు
మును వనమున కేఁగి యచట మునిజనగేయున్
వినుత తపోధౌరేయున్
ఘను ననుపమ గుణవిధేయుఁ గనె మైత్రేయున్. | 0 | కందం |
387 | నిక్కము దాఁప నేల ధరణీసుతనందన యింక నీపయిన్
జిక్కె మనంబు నాకు ననుఁ జిత్తజుబారికి నప్పగించెదో
చొక్కి మరందమద్యములచూఱలఁబాటలు వాడుతేంట్లసొం
పెక్కినయట్టిపూవుఁబొదరిండ్లను గౌఁగిట గారవించెదో. | 1 | ఉత్పలమాల |
162 | హరి దన నాభిపంకరుహమందు జనించిన యట్టి భారతీ
శ్వరుఁ డతిభక్తి వేడ యదువంశమునన్ బలకృష్ణమూర్తులై
పరఁగ జనించి భూభరముఁ బాపిన భవ్యులు రేవతీందిరా
వరులట శూరసేనుని నివాసమునన్ సుఖ మున్నవారలే? | 2 | చంపకమాల |
518 | అంబర వీథి నిల్చి త్రిదశాంతకు లెంతయు నేచి, రక్తమాం
సంబులు గాధినందనుని జన్నముపైఁ గురియంగ, నంతలో
నంబర రత్న వంశ కలశాంబుధి చంద్రుఁడు, రామచంద్రుఁడు
గ్రంబుగఁ ద్రుంచెఁ జండబల గర్వులఁ దమ్ముఁడు దాను నొక్కటై. | 1 | ఉత్పలమాల |
32 | భువనాత్మకుఁ డా యీశుఁడు
భవనాకృతితోడ నుండు బ్రహ్మాండంబున్
వివరముతోఁ బదునాలుఁగు
వివరంబులుగా నొనర్చె విశదంబులుగన్ | 0 | కందం |
571 | పగ నీ కెక్కడి దింకను
నగచర! నగ భేది సుతుని నా యస్త్రమునన్
దెగ నేయుదు నమ్ము మనుచు
జగదీశుఁడు పలుక నతఁడు సంతోషించెన్. | 0 | కందం |
469 | చనువారిన్ గని యేడ్చువారు జముఁడా! సత్యంబుగా వత్తు మే
మనుమానం బిఁకలేదు నమ్ముమని తా రావేళ నా రేవునన్
మునుగన్ బోవుచు బాసచేయుట సుమీ ముమ్మాటికింజూడగాఁ
చెనటుల్గానరు దీని భావమిదివో శ్రీకాళహస్తీశ్వరా! | 3 | మత్తేభము |
121 | రామ! గుణాభిరామ! దినరాజకులాంబుధిసోమ! తోయద
శ్యామ! దశాననప్రబలసైన్యవిరామ! సురారిగోత్రసు
త్రామ! సుబాహుబాహుబలదర్ప తమఃపటుతీవ్రధామ! ని
ష్కామ! కుభృల్లలామ! కఱకంఠసతీనుతనామ! రాఘవా! | 1 | ఉత్పలమాల |
459 | అమ్మా! యయ్య! యటంచునెవ్వరిని నేనన్నన్శివా! నిన్ను నే
సుమ్మీ నీ మదిఁ తల్లిదండ్రులనటంచున్జూడఁగాఁబోకు నా
కిమ్మైఁ దల్లియు దండ్రియున్ గురుఁడు నీవేకాన సంసారపుం
జిమ్మంజీకటిఁగప్పకుండఁ గనుమా! శ్రీకాళహస్తీశ్వరా! | 4 | శార్దూలము |
163 | కురుకులు లాదరింపఁగ సఖుండును నాప్తుఁడునై తనర్చి సో
దర తరుణీజనంబులనుఁ దత్పతులం గడు గారవంబునం
గరుణ దలిర్ప నాత్మజులకంటెఁ బ్రియోన్నతిఁ బ్రోచువాడు సు
స్థిరమతి నున్నవాఁడె వసుదేవుఁడు వృష్ణికులప్రదీపకా! | 2 | చంపకమాల |
520 | కొందఱు పల్లకీల, మఱి కొందఱు తేరుల, నందలంబులం
గొందఱు, కొంద ఱశ్వములఁ, గొందఱు మత్త గజేంద్ర సంఘమున్
గొందఱు స్వర్ణ డోలికలఁ, గోరిక నెక్కి నృపాల నందనుల్
సందడిఁగాఁగ వచ్చిరి, బుజంబు బుజంబును ద్రోపులాడఁగన్. | 1 | ఉత్పలమాల |
298 | ఎప్పుడు దప్పులు వెదకెడు
నప్పురుషుని గొల్వగూడ దది యెట్లన్నన్
సర్పంబు పడగ నీడను
గప్ప వసించిన విధంబు గదరా సుమతీ | 0 | కందం |
112 | లోకద్రోహినరేంద్రా
నీకముఁ బరిమార్చి జగము నెఱి నిల్పిన యా
వైకుంఠనాథు విజయం
బాకల్పస్థాన మయ్యె నవనీనాథా! | 0 | కందం |
35 | మండలములోన భాస్కరుఁ
డుండి జగంబులకు దీప్తి నొసఁగెడి క్రియ బ్ర
హ్మాండములోపల నచ్యుతుఁ
డుండుచు బహిరంతరముల నొగి వెలిఁగించున్. | 0 | కందం |
532 | నారదు లైరి సన్మునులు, నాక మహీజము లయ్యె భూజముల్,
శారద లైరి భామినులు, శంకర శైలము లయ్యె గోత్రముల్,
పారద మయ్యె నీరధులు, పన్నగ నాయకు లయ్యె నాగముల్,
వారిద వర్గ మెల్ల సిత వర్ణము లయ్యెను బండు వెన్నెలన్. | 1 | ఉత్పలమాల |
545 | ఆరాము భార్య విభ్రమ
మే రాజకుమార్తెలందు నెఱుఁగము విని మున్
ధారుణిలోపలఁ గామిను
లా రమణికి సాటి పోల రభినుతి సేయన్. | 0 | కందం |
135 | సూరిజనగేయ మగు రాజసూయ యజ్ఞ
విలస దవభృథస్నాన పవిత్రమైన
ద్రౌపదీ చారు వేణీభరంబు పట్టి
కొలువులోపల నీడ్చిరి కుత్సితమున. | 5 | తేటగీతి |
95 | శ్రీకాంతాతిలకంబు రత్నరుచిరాజిప్రేంఖితస్వర్ణడో
లాకేళిన్ విలసిల్లి తత్కచభరాలంకార స్రగ్గంధలో
భాకీర్ణప్రచరన్మధువ్రత మనోజ్ఞాలోలనాదంబు ల
స్తోకానుస్వర లీల నొప్పఁగ నిజేశున్ వేడ్కతోఁ బాడఁగన్. | 4 | శార్దూలము |
288 | అప్పిచ్చువాడు, వైద్యుడు
నెప్పుడు నెడతెగక పారు నేరును, ద్విజుడున్
జొప్పడిన యూర నుండుము
చొప్పడకున్నట్టి యూరు చొరకుము సుమతీ | 0 | కందం |
450 | ఱాలన్ రువ్వఁగ చేతులాడవు, కుమారా! రమ్మురమ్మంచునే
చాలన్ చంపగ, నేత్రముల్దివియగా శక్తుండనేఁ గాను, నా
శీలంబేమని చెప్పనున్న దిక నీ చిత్తంబు, నా భాగ్యమో
శ్రీ లక్ష్మీపతి సేవితాంఘ్రియుగళా! శ్రీ కాళహస్తీశ్వరా! | 4 | శార్దూలము |
230 | బాలశీతాంశురేఖా విభాసమాన
ధవళ దంష్ట్రాగ్రమున నున్న ధరణి యొప్పె
హరికి నిత్యానపాయిని యైన లక్ష్మి
నెఱయఁ బూసిన కస్తూరినికర మనఁగ. | 5 | తేటగీతి |
355 | ఏగతిఁ బాటుపడ్డఁ గలదే భువి నల్పునకున్ సమగ్రతా
భోగము భాగ్యరేఖగల పుణ్యునకుంబలె; భూరి సత్త్వసం
యోగ మదేభ కుంభయుగళోత్థిత మాంసము నక్కకూనకే
లాగు ఘటించు! సింహము దలంచినఁ జేకురు గాక భాస్కరా! | 1 | ఉత్పలమాల |
549 | అంత పనయ్యెనేని, దను జాంతకు, నంతకు, మన్మథాంతకున్
బంతము మీఱఁగా గలఁచి, పన్నగ మర్త్య సురేంద్ర లోకముల్
బంతులు గట్టియూడ్చి, రిపు భంజను రాముని గందకుండ న
ర్పింతును నీకుఁ దెచ్చి, మది భీతిని బొందకు మమ్మ జానకీ! | 1 | ఉత్పలమాల |
460 | కొడుకుల్ పుట్టరటంచు నేడ్తురవివేకుల్జీవనభ్రాంతులై
కొడుకుల్ పుట్టరె కౌరవేంద్రున కనేకుల్ వారిచే నేగతుల్
వడసెం బుత్రులులేని యా శుకునకున్ వాటిల్లెనే దుర్గతుల్
చెడునే మోక్షపదం బపుత్రకునకున్ శ్రీకాళహస్తీశ్వరా! | 3 | మత్తేభము |
87 | కారణకార్యహేతు వగు కంజదళాక్షునికంటె నన్యు లె
వ్వారును లేరు; తండ్రి! భగవంతు ననంతుని విశ్వభావనో
దారుని సద్గుణావళు లుదాత్తమతిం గొనియాడకుండినం
జేరవు చిత్తముల్ ప్రకృతిఁ జెందని నిర్గుణమైన బ్రహ్మమున్. | 1 | ఉత్పలమాల |
470 | భవదుఃఖంబులు రాజకీటముల నే బ్రార్థించినం బాయునే
భవదంఘ్రిస్తుతిచేతఁగాక విలసద్బాలక్షుధాక్లేశదు
ష్టవిధుల్మానునె చూడ మేఁకమెడచంటందల్లి కారుణ్య దృ
ష్టివిశేషంబున నిచ్చు చంటఁబలెనో శ్రీకాళహస్తీశ్వరా! | 3 | మత్తేభము |
231 | హవరూపివి హవనేతవు
హవభోక్తవు నిఖిలహవఫలాధారుఁడవున్
హవరక్షకుఁడవు నగు నీ
కవితథముగ నుతులొనర్తు మయ్య; ముకుందా! | 0 | కందం |
167 | హరిపదసేవకుఁ డరి భీ
కరుఁ డర్జును వలన మిగులఁ గార్ముక విద్యల్
దిరముగఁ గఱచిన సాత్యకి
వరసుఖ విభవముల నున్నవాఁడె ధరిత్రిన్? | 0 | కందం |
58 | హరిసుతుఁ బరిచరుఁగాఁ గొని
హరిసుతుఁ దునుమాడి పనిచె హరిపురమునకున్;
హరివిభునకు హరిమధ్యను
హరిరాజ్యపదంబు నిచ్చె హరివిక్రముఁడై. | 0 | కందం |
251 | శ్రీ రఘువంశ తోయధికి శీతమయూఖుడవైన నీ పవి
త్రోరుపదాబ్జముల్ వికసితోత్పల చంపక వృత్తమాధురీ
పూరితవాక్ప్రసూనముల బూజలొనర్చెద జిత్తగింపుమీ
తారకనామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ | 1 | ఉత్పలమాల |
265 | సిరులిడసీత పీడలెగ జిమ్ముటకున్ హనుమంతుడార్తిసో
దరుడు సుమిత్రసూతి దురితంబులుమానుప రామ నామముం
గరుణదలిర్ప మానవులగావగ బన్నిన వజ్రపంజరో
త్కరముగదా భవన్మహిమ దాశరథీ కరుణాపయోనిధీ. | 2 | చంపకమాల |
313 | కొక్కోకమెల్ల జదివిన,
చక్కనివాడైన, రాజ చంద్రుండైనన్,
మిక్కిలి రొక్కము లియ్యక,
చిక్కదురా వారకాంత సిద్ధము సుమతీ | 0 | కందం |
524 | ఇన వంశోద్భవుఁడైన రాఘవుఁడు, భూమీశాత్మజుల్ వేడ్కతోఁ
దను వీక్షింప, మునీశ్వరుం డలరఁ, గోదండంబు చే నంది, చి
వ్వన మోపెట్టి, గుణంబు పట్టి, పటు బాహా శక్తితోఁ దీసినన్,
దునిఁగెన్ జాపము భూరి ఘోషమున, వార్ధుల్ మ్రోయుచందంబునన్ | 3 | మత్తేభము |
59 | వికటభ్రూకుటిఫాలభాగుఁ డగుచున్ వీరుండు క్రోధారుణాం
బకుడై చూచిన యంతమాత్రమున నప్పాథోధి సంతప్తతో
యకణగ్రాహ తిమింగిలప్లవ ఢులీ వ్యాళప్రవాళోర్మికా
బక కారండవ చక్ర ముఖ్య జలసత్వశ్రేణితో నింకినన్. | 3 | మత్తేభము |
140 | కౌరవ పాండవు లిరువురు
నారయ నీ కొక్క సమమ యవనీవర! నీ
వే రీతి నైన బాండుకు
మారుల పాలొసఁగి తేని మను నుభయంబున్. | 0 | కందం |
485 | స్తోత్రం బన్యులఁ జేయనొల్లని వ్రతస్థుల్వోలె వేసంబుతోఁ
బుత్రీపుత్రకళత్రరక్షణ కళాబుద్ధిన్ నృపాలాధమున్
బాత్రంబంచు భజింపఁబోదు రిదియున్భావ్యంబె యవ్వారి చా
రిత్రం బెన్నఁడు మెచ్చనెంచ మదిలో శ్రీకాళహస్తీశ్వరా! | 4 | శార్దూలము |
94 | కమనీయ రూపరేఖా
రమణీయతఁ జాల నొప్పు రమణీమణి య
క్కమలాలయ దన మృదు కర
కమలంబుల విభుని పాదకమలము లొత్తెన్. | 0 | కందం |
488 | శ్రీనగమందిరుం, డమరసేవితుఁ డర్ధశశాంక మౌళి, స
న్మౌని, మనః పయోజ దిననాయకుఁ డబ్జభవామరేశ్వర
ధ్యాన లసత్ప్రసన్నుఁ డతి ధన్యుండు, శేషవిభూషణుండు, వి
ద్యానిధి, మల్లికార్జునుఁడు, తానిడు మాకు శుభంబులొప్పగన్. | 1 | ఉత్పలమాల |
369 | దివి బిసరుహబాంధవసైం
ధవసంఘం బెంతదవ్వు దగ లేకరుగున్
భువి నంతదవ్వు నేమును
ఠవఠవ లేకరుగుదుము హుటాహుటి నడలన్. | 0 | కందం |
414 | గాండీవము నీచేతిది
పాండవునిన్ జేరఁబట్టి బ్రతికితి మా వి
ల్లుండిన నేఁడు నిశాచర
చెండవె యల్లునికిఁ దోడు శితభల్లములన్. | 0 | కందం |
145 | నీపుత్రుల శౌర్యంబునుఁ
జాపాచార్యాపగాత్మజాత కృపభుజా
టోపంబునుఁ గర్ణు దురా
లాపంబులు నిజముగాఁ దలంతె మనమునన్. | 0 | కందం |
574 | కూరలు నోటికిన్ రుచులు గూడుట దప్పెను, దుంపదూఁడులుం
గారము తోఁచె, జిహ్వకును గమ్మని తేనెలు చేఁదు లయ్యెఁ, గం
గారయెఁ జిత్తమంతయును, గంటికి నిద్ర రహింపదయ్యె శృం
గార మెలర్ప సీతఁ బొడఁగానమి, రామనృపాల మౌళికిన్. | 1 | ఉత్పలమాల |
136 | కావున వారల కపకృతిఁ
గావింపని దొక దినంబు గలుగదు, తమ జ
న్మావధి నిజ నందనులను
వావిరి నయ్యంధనృపతి వలదనఁ డయ్యెన్. | 0 | కందం |
510 | వనజ గర్భుని గూర్చి రావణుఁడు మున్ను
తపముఁ జేసిన వర మిచ్చు తఱినిఁ దనకు
నేరిచేఁ జావు లేకుండఁ గోరువాఁడు
నరుల వానరులను జెప్ప మఱచినాఁడు | 5 | తేటగీతి |
110 | మహదహంకార పంచ తన్మాత్ర గగన
పవన శిఖి తోయ భూ భూతపంచ కేంద్రి
యప్రపంచంబు భగవంతునందు నగుట
సర్గ మందురు దీనిని జనవరేణ్య! | 5 | తేటగీతి |
374 | విలయకృశానుకీలములవేఁడిమిఁ బోఁడిమి మాలి వెల్మిడిన్
గలసిన భూతధాత్రి మఱి క్రమ్మఱ రూపయి నిల్చి యోషధుల్
మొలవఁగఁజేయునట్టి నయమున్ బ్రతికల్పము నెట్లు గాంచు నీ
చలిమలవల్ల నుల్లసిలు చల్లఁదనంబును నూనకుండినన్. | 2 | చంపకమాల |
46 | వేనుఁడు విప్రభాషణ పవిప్రహతిచ్యుత భాగ్యపౌరుషుం
డై నిరయంబునం బడిన నాత్మ తనూభవుఁడై పృథుండు నాఁ
బూని జనించి తజ్జనకుఁ బున్నరకంబును బాపె; మేదినిన్
థేనువుఁ జేసి వస్తువితతిం బితికెన్ హరి సత్కళాంశుఁడై. | 1 | ఉత్పలమాల |
405 | రాజు తేజస్వియై గ్రహరాజుమీఁద
నలిగి దాడిగ వెంటాడ నిలువ కతఁడు
బెగడువడి పాఱుచోఁ జెఱఁ దగిలినట్టి
ఛాయ యిది యన నీలలాంఛనము మెఱసె. | 5 | తేటగీతి |
511 | ధరణీపతి యగు దశరథ
నరనాయకు నింటఁ బుట్టి నర రూపమునం
బెరిగెద నేనిక, మీరును
సుర కంటకుమీఁద లావు సూపుటకొఱకై. | 0 | కందం |
127 | మండితతేజోనిధి యై
పాండవ హితమతిని దూతభావంబున వే
దండపురి కేగి కురుకుల
మండనుఁ డగు ధార్తరాష్ట్రు మందిరమునకున్. | 0 | కందం |
415 | అనుచు నిందించి వలవంత యినుమడింప
నవ్వరారోహ విదళితహల్లకముల
కమ్మపుప్పొడిపై దుమారమ్ము రేఁచు
మలయమంథరపవనుపై నలుక వొడమి. | 5 | తేటగీతి |
330 | నవరస భావాలంకృత
కవితా గోష్టియును, మధుర గానంబును దా
నవివేకి కెంత జెప్పిన
జెవిటికి శంఖూదినట్లు సిద్ధము సుమతీ! | 0 | కందం |
69 | మయసూనుండు నిజానువర్తుల మహామాయన్ మహీభృద్గుహా
శ్రయులంగా నొనరించి తత్పథము నీరంధ్రంబు గావించినన్
రయ మొప్పం గుటిలాసురాధమునిఁ బోరం ద్రుంచి గోపావళిన్
దయతోఁ గాచిన కృష్ణు సన్మహిమ మేతన్మాత్రమే తాపసా! | 3 | మత్తేభము |
302 | ఓడల బండ్లును వచ్చును,
ఓడలు నాబండ్లమీద నొప్పుగ వచ్చున్,
ఓడలు బండ్లును వలనే
వాడంబడు గలిమి లేమి వసుధను సుమతీ | 0 | కందం |
179 | కావున నమ్మహాత్ముని వికారవిదూరుని సర్వమోహమా
యావిలమానసుండ నగునప్పుడు సంసృతిదుఃఖినౌదు న
ద్ధేవుని సత్కృపామహిమఁ దేలినవేళ సుఖింతు నేనకా
దా విధిశంకరప్రభృతు లవ్విభుమాయఁ దరింపనేర్తురే. | 1 | ఉత్పలమాల |
555 | వనచరు లొక గిరి చేరువ
వనమునఁ జరియింపఁ జూచి వసుధా సుతయున్
దన చీర కొంగు తునకను
దన సొమ్ములు మూట గట్టి ధరపై వైచెన్. | 0 | కందం |
89 | పురుషభవంబునొందుట యపూర్వము జన్మము లందు; నందు భూ
సుర కుల మందుఁ పుట్టు టతిచోద్యము; నిట్లగుటన్ మనుష్యుల
స్థిర మగు కార్య దుర్దశలచేత నశింపక విష్ణు సేవనా
పరతఁ దనర్చి నిత్యమగు భవ్యపథంబును బొందు టొప్పదే? | 2 | చంపకమాల |
192 | హరి పితృ సుపర్వ తిర్య
ఙ్నర రూపములన్ జనించి నయమున మన్వం
తరముల నిజ సత్త్వంబునఁ
బరిపాలించును జగంబుఁ బౌరుష మొప్పన్. | 0 | కందం |
506 | అమృత ధారా ప్రవాహమ్మునందు నెపుడు
నొక్క ధేనువు దివి నున్న నుచిత మగునె?
అమృత ధారా ప్రవాహమ్మునందు నెపుడుఁ
బెక్కు ధేనువు లప్పురిఁ బేరు నొందు. | 5 | తేటగీతి |
268 | అవనిజ కన్నుదోయి తొగలందు వెలింగెడు సోమ, జానకీ
కువలయనేత్రి గబ్బిచనుకొండల నుండు ఘనంబ మైథిలీ
నవనవ యౌవనంబను వనంబునకున్ మదదంతి నీవెకా
దవిలి భజింతు నెల్లపుడు దాశరథీ కరుణాపయోనిధీ! | 2 | చంపకమాల |
376 | అకలంకౌషధసత్త్వమున్ దెలియ మాయాద్వారకావంతికా
శికురుక్షేత్రగయాప్రయాగములు నే సేవింప కుద్దండగం
డకవేదండవరాహవాహరిపుఖడ్గవ్యాఘ్ర మిమ్మంచుఁగొం
డకు రాఁ జెల్లునె బుద్ధిజాడ్యజనితోన్మాదుల్ గదా శ్రోత్రియుల్. | 3 | మత్తేభము |
429 | చూతమె డాసి పక్వతరశుక్తిపుటాంతరదృశ్యమౌక్తిక
వ్రాతము లై వెలుంగు గరువంపుఁగొటారులనొప్పు తామ్రప
ర్ణీతట మట్లు జీర్ణదళబృందసమావృతపాండురప్రసూ
నాతిమనోజ్ఞమూలముల నర్థి నెసంగుమధూకసాలముల్. | 1 | ఉత్పలమాల |
106 | హరివచనంబు లాత్మకుఁ బ్రియం బొనరింపఁ బయోజగర్భుఁ "డో!
పరమపదేశ! యోగిజనభావన! యీ నిఖిలోర్వి యందు నీ
యరయని యట్టి యర్థ మొకఁడైననుఁ గల్గునె? యైన నా మదిన్
బెరసిన కోర్కి దేవ! వినిపింతు దయామతిఁ జిత్తగింపవే. | 2 | చంపకమాల |
550 | సన్యాసి వేష మలరఁగ
నన్యాయము తలఁచుకొనుచు నసురేంద్రుఁడు దాఁ
గన్యారత్నముఁగని సౌ
జన్యమునన దీవన లిడె శాంతము దోఁపన్. | 0 | కందం |
80 | అమరఁ ద్రివిక్రమస్ఫురణ నందిన యమ్మహితాత్ముపాద వే
గమున హతంబులైన త్రిజగంబుల కావల వెల్గు సత్యలో
కము చలియించినం గరుణఁ గైకొని కాచి ధరించు పాదప
ద్మము తుది నున్న యప్రతిహతం బగు శక్తి గణింప శక్యమే? | 2 | చంపకమాల |
139 | చని యచట భీష్మ గురు త
త్తనయ కృపాచార్య నిఖిల ధాత్రీపతులున్
విని యనుమోదింపఁగ ని
ట్లనియెన్ ధృతరాష్ట్రుతోడ నవనీనాథా! | 0 | కందం |
487 | ఒకయర్థంబును నిన్ను నే నడుగఁగా నూహింప నెట్లైన బొ
మ్ము కవిత్వంబులు నాకు జెందవని యేమోయంటివా నాదు జి
హ్వకు నైసర్గిక కృత్యమింతయు సుమీ ప్రార్థించుటే కాదు కో
రికలన్నిన్నును గాన నాకు వశమా శ్రీకాళహస్తీశ్వరా! | 3 | మత్తేభము |
10 | చారుతర ధర్మరాశికి
భారకుఁడగు కృష్ణుఁ డాత్మపదమున కేఁగన్,
భారకుఁడు లేక యెవ్వనిఁ
జేరును ధర్మంబు బలుపు సెడి, మునినాథా! | 0 | కందం |
285 | అక్కరకు రాని చుట్టము,
మ్రొక్కిన వరమీని వేల్పు, మోహరమున దా
నెక్కిన బారని గుర్రము
గ్రక్కున విడవంగవలయు గదరా సుమతీ | 0 | కందం |
442 | నీనా సందొడబాటు మాట వినుమా! నీచేత జీతంబునేఁ
గానింబట్టక సంతతంబు మదివేడ్కన్గొల్తు నంతస్సప
త్నానీకంబున కొప్పగింపకుము నన్నాపాటియే చాలుఁదే
జీనొల్లం గరినొల్ల నొల్లసిరులన్ శ్రీకాళహస్తీశ్వరా! | 4 | శార్దూలము |
114 | జలజనాభ దయాకటాక్షప్రసాద
లబ్ధి నఖిలైక లోకపాలక విభూతి
మహిమఁ బొందిన వారి ధర్మములు విస్త
రమునఁ బలుకుట మన్వంతరములు భూప! | 5 | తేటగీతి |
385 | అండజయాన నీ వొసఁగునట్టి సపర్యలు మాకు వచ్చె నిం
దుండఁగ రాదు పోవలయు నూరికి నింటికి నిప్పు డేను రా
కుండ నొకండు వచ్చి మఱియొండునె భక్తియ చాలు సత్క్రియా
కాండముఁ దీర్ప వేగ సనఁగావలయున్ గరుణింపు నాపయిన్ | 1 | ఉత్పలమాల |
423 | రారమ్మనుటయు దివిష
న్నారీరత్నంబు నికటనాకధునీక
ల్హారాంభోరుహమధురస
ధారాచంద్రకితసలిలధౌతానన యై. | 0 | కందం |
365 | కులమున నక్కడక్కడ నకుంఠిత ధార్మికుఁడొక్కఁడొక్కఁడే
కలిగెడుఁగాక పెందఱుచు గల్గగ నేరరు; చెట్టు చెట్టునన్
గలుగఁగ నేర్చునే? గొడుగు కామలు చూడఁగ నాడనాడ నిం
పలరఁగ నొక్కటొక్కటి నయంబునఁ జేకురుఁగాక భాస్కరా! | 2 | చంపకమాల |
261 | చక్కెరమాని వేము దినజాలినకైవడి మానవాధముల్
పెక్కురు బక్కదైవముల వేమఱుగొల్చెదరట్లు కాదయా
మ్రొక్కిన నీకు మ్రొక్కవలె మోక్షమొసంగిన నీవ యీవలెం
దక్కిన మాటలేమిటికి దాశరథీ కరుణాపయోనిధీ. | 1 | ఉత్పలమాల |
256 | శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీరవైష్ణవా
చార జవంబుగాగ విరజానది గౌతమిగా వికుంఠ ము
న్నారయభద్ర శైలశిఖరాగ్రముగాగ వసించు చేతనో
ద్ధారకుడైన విష్ణుడవు దాశరథీ కరుణాపయోనిధీ. | 1 | ఉత్పలమాల |
576 | ఆ తఱి వానరప్రవరులా ధరణీ సుతఁ గానలేక దుః
ఖాతురులై వగం బడఁగ నయ్యెడఁ దద్గిరినుండి వచ్చి సం
పాతి యనం బ్రసిద్ధుఁ డగు పక్షి కులేంద్రుఁడు రావణుండు దా
సీతను గొంచుఁ బోవుగతిఁ జెప్పుచుఁ దెల్పెను లంక త్రోవయున్. | 1 | ఉత్పలమాల |
280 | దాసిన చుట్టమా శబరి దాని దయామతి నేలినావు; నీ
దాసుని దాసుడా గుహుడు తావకదాస్యమొసంగినావు; నే
జేసిన పాపమో వినుతి చేసిన గావవు; గావుమయ్య, నీ
దాసులలోన నేనొకడ దాశరథీ కరుణాపయోనిధీ! | 1 | ఉత్పలమాల |
287 | అప్పు కొని చేయు విభవము,
ముప్పున బ్రాయంపుటాలు, మూర్ఖుని తపమున్,
దప్పరయని నృపు రాజ్యము
దెప్పరమై మీద గీడు దెచ్చుర సుమతీ | 0 | కందం |
215 | ఘనుఁడు స్వయంభువునకుఁ బ్రియ
తనయుఁడు స్వాయంభువుండు దైతేయవిభే
దనసేవాచతురుండును
జనవినుతుండాదిరాజ్యసత్తముఁడౌటన్. | 0 | కందం |
342 | అదను దలంచి కూర్చి ప్రజ నాదరమొప్ప విభుండు కోరినన్
గదిసి పదార్థమిత్తురటు కానగ వేగమె కొట్టి తెండనన్
మొదటికి మోసమౌఁ; బొదుగు మూలముగోసినఁ బాలు గల్గునే
పిదికినఁ గాక భూమిఁ బశుబృందము నెవ్వరికైన భాస్కరా! | 2 | చంపకమాల |
22 | తీర్థపాదుఁడయిన దేవుండు విష్ణుండు
తన చరిత్ర మేను దవిలి పాడఁ,
జీరఁబడ్డవాని చెలువున నేతెంచి
ఘనుఁడు నామనమునఁ గానవచ్చు. | 6 | ఆటవెలది |
546 | ఒడ లెల్లను బంగారము,
పొడ లెల్లను రత్న సమితిఁ బోలిన మెఱపుల్
నడ లెల్ల నెఱపి మెలఁగెడు
కడ లెల్ల విలాస రేఖ కళలం దొప్పెన్. | 0 | కందం |
104 | కావున మద్భక్తికిఁ దప
మేవిధమున మూలధనము నిది నీ మది రా
జీవభవ! యెఱిఁగి తప మిటు
గావించుట విగతమోహకర్ముఁడ వింకన్. | 0 | కందం |
472 | లేవో కానలఁ గందమూలఫలముల్ లేవో గుహల్ తోయముల్
లేవో యేఱులఁ బల్లవాస్తరణముల్ లేవో సదాయాత్మలో
లేవో నీవు విరక్తులన్మనుప జాలింబొంది భూపాలురన్
సేవల్సేయఁగఁ బోదురేలొకొ జనుల్ శ్రీకాళహస్తీశ్వరా! | 4 | శార్దూలము |
Single-label Telugu poetic meter (chandassu) classification for PoetryMTEB embedding evaluation, derived from Padyam2Gadyam.
| Item | Description |
|---|---|
| Source | TeluguLLMResearch/Padyam2Gadyam; paper arXiv:2606.02806 |
| Languages | Telugu (te) |
| Size | train=468; test=118 (no validation; MTEB Classification uses train→fit, test→score) |
| Classes | 7 meters with frequency ≥ 10 |
| Filtering | Dropped 14 poems in rare meters (count < 10); raw=600 → kept=586 |
| Splits | Stratified by meter ≈ 80% / 19% (train / test), seed=42 |
| License | CC BY-NC 4.0 (same as upstream) |
| Evaluation metrics | Classification on embeddings: accuracy, macro/weighted F1 |
| Field | Type | Description |
|---|---|---|
id |
string | Example id |
poem |
string | Classical Telugu poem text |
label |
int64 | Meter class index (0 … C−1) |
label_name |
string | Meter name in Telugu |
Codebook: label_taxonomy.json.
| id | label_name | gloss | count |
|---|---|---|---|
| 0 | కందం | Kandam (坎达体) | 216 |
| 1 | ఉత్పలమాల | Utpalamāla (优钵罗鬘) | 115 |
| 2 | చంపకమాల | Champakamāla (瞻波迦鬘) | 79 |
| 3 | మత్తేభము | Mattebhamu (醉象律) | 79 |
| 4 | శార్దూలము | Śārdūlamu (虎律) | 43 |
| 5 | తేటగీతి | Tēṭagīti (澄歌体) | 35 |
| 6 | ఆటవెలది | Āṭaveladi (戏舞体) | 19 |
| meter | count |
|---|---|
| సీసము+తేటగీతి | 6 |
| మాలిని | 2 |
| చంపకమాల-పంచపాది | 2 |
| తరళము | 1 |
| ఉత్పలమాల-పంచపాది | 1 |
| ఉత్సాహము | 1 |
| మత్తకోకిల | 1 |
Meter; keep classes with frequency ≥ 10.label ids (frequency-descending order).from datasets import load_dataset
ds = load_dataset("PoetryMTEB/Padyam2GadyamMeterClassification")
print(ds["test"][0]["label_name"], ds["test"][0]["poem"][:60])
For embedding evaluation, encode poem, fit a classifier on train labels, score on test.
Distributed under Creative Commons Attribution-NonCommercial 4.0 International (CC BY-NC 4.0), consistent with the upstream dataset.
@misc{kranti2026translatingclassicalpoetrymodern,
title={Translating Classical Poetry into Modern Prose},
author={Chalamalasetti Kranti and Sowmya Vajjala},
year={2026},
eprint={2606.02806},
archivePrefix={arXiv},
primaryClass={cs.CL},
url={https://arxiv.org/abs/2606.02806},
}
PoetryMTEB/Padyam2GadyamMeterClassification