Dataset Viewer
Auto-converted to Parquet Duplicate
id
stringlengths
1
4
poem
stringlengths
71
312
label
int64
0
7
label_name
stringclasses
8 values
2110
నరసింహ! నే నిన్ను నమ్మినందుకుఁ జాల - నెనరు నాయందుంచు నెమ్మనమున నన్ని వస్తువులు నిన్నడిగి వేసటపుట్టె - నింకనైనఁ గటాక్షమియ్యవయ్య సంతసంబున నన్ను స్వర్గమందే యుంచు - భూమియందే యుంచు భోగిశయన! నయముగా వైకుంఠనగరమందే యుంచు - నరకమందే యుంచు నళిననాభ!
3
seesamu
4348
గురుపదాంబుజముల భక్తి కుదిరి తమ్ముఁ । దా మెఱుంగక ముక్తి లేదవనియందు మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల!
2
teytageethi
1889
పలుమారు నే వచ్చి ప్రార్థించి పిలిచిన పలుకవదేమిరా పంకజాక్షయలివేణి మీయింతి యాడిన మాటలు మరుతునా యిక నేను మందయానఇంతుల మాటల కెగ్గులెంతురె దయాపరుడవై ఇటు బల్క బాడియగునెవలపెఱుంగక విభుని వాదుకు దీసుట రమణికి దగునే యో రామ చెపుమ
3
seesamu
1183
సత్తువగల యాతని పై నెత్తిన దుర్బలుఁడు తస్కరించిన నతండున్‌ విత్తముఁ గోల్పడు నతఁడును జిత్తజ పీడితుఁడు జింతఁ జెందుఁ గుమారా!
1
kandamu
3297
_x000D_ మేఘ మడ్డమయిన మిహిరుని జెఱచును _x000D_ జిత్తమడ్డమయిన స్థిరముఁ జెఱచు _x000D_ పఱుపు లడ్డమైన మఱిముక్తి జెఱచురా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1618
నీ మాహాత్మ్యము, నీ రయోపచయమున్‌, నీ సత్త్వసామగ్రియున్‌ సామాన్యంబె యొకింత వాయువునకున్‌, నాగారికిన్‌ కల్గితే నేమోకాని తలంప ముజ్జగములం దెవ్వారికిం గల్గదో హైమాద్రిప్రతిమోన్నతీ! గురుమతీ! అర్కద్యుతీ! మారుతీ!
7
saardulamu
2162
వేమాఱు నీకథల్‌ వినుచు నుండెడివాఁడు - పరుల ముచ్చటమీఁద భ్రాంతిపడఁడు అగణితంబుగ నిన్నుఁ బొగడ నేర్చినవాఁడు - చెడ్డమాటలు నోటఁ జెప్పఁబోఁడు ఆసక్తిచేత నిన్ననుసరించెడివాఁడు - ధనమదాంధుల వెంటఁ దగులఁబోఁడు సంతసంబున నిన్ను స్మరణఁ జేసెడివాఁడు - చెలఁగి నీచులపేరుఁ దలఁపఁబోఁడు
3
seesamu
664
పాపము లొందువేళ రణపన్నగభూత భయజ్వరాదులం దాపద నొందువేళ భరతాగ్రజ మిమ్ము భజించువారికిం బ్రాపుగ నీవుఁ దమ్ముఁడిరు ప్రక్కియలంజని తద్విపత్తిసం తాపముమాన్పి కాతువఁట దాశరథీ! కరుణాపయోనిధీ!
6
vutpalamaala
3734
_x000D_ ఇంచుకంత యోని కెగసెడు జనములు _x000D_ కంచముకడ పిల్లి గాచినట్లు _x000D_ పంచబాణునింటి బానిసె కొడుకులు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3355
_x000D_ మాటచెఱపు మూట మర్మము కర్మము _x000D_ ఆశయ కడగట్టు అప్పుముప్పు _x000D_ బాస దోస మెన్నఁ బలుకులు ములుకులు _x000D_ లేశమయినఁ దెలియలేరు వేమా.
0
aataveladi
4106
_x000D_ మేకఁ జంకఁబెట్టి మెలఁగుచు మందలో _x000D_ బ్రమసి తిరుగు గొల్లపగిది గాక _x000D_ దైవ మెఱుఁగక పరదైవముల్‌ దలఁచును _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
94
గరువ మేటికి నీ మర్మ మెఱుఁగ రనుచుఁ-దెలిసినమహాత్ములకు నైనఁ దెలియకున్నె చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ-హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!
2
teytageethi
4355
అబ్బ మేలోర్వలేనట్టివాఁడైనను । మోహంబుగల తల్లి మూఁగదైన ఆలు రక్కసియైన నల్లుఁ డనదయైనఁ । గూతురు పెనుఱంకుఁబోతుదైనఁ గొడుకు తుందుడుకైనఁ గోడలు దొంగైనఁ । దనకు సాధ్యుఁడుగాని తమ్ముఁడైన గృహకృత్యములు పొరుగిండ్ల వెంబడిఁ బోయి । చెప్పి యేడ్చెడు చెడ్డచెల్లెలైన
3
seesamu
1575
"ఖల దైత్యాధమ! జానకీసతిని నీ కంఠస్థశాతాసిగాఁ దలపై బడ్డ మహాశనిచ్ఛదముగాఁ దాలుస్థితోద్యద్ధలా హలముంగా వసనాంచలగ్రథిత దీప్తాగ్నిస్ఫులింగంబుగా తలప న్నేరక దెచ్చి తీ" వని రహిన్‌ దర్జింపవే మారుతీ!
4
mattebhamu
3741
_x000D_ తలి గర్భమందుఁ దాఁబుట్టి నప్పుడు _x000D_ మొదల బట్ట లేదు తుదను లేదు _x000D_ నడుమ బట్టగట్ట నగుఁబాటు గాదటో _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2923
నీ కడకంటిచే హరిణి నీ కనుసైగలఁ జిత్రరేఖయున్ నీ కళ చేత హేమగతి నీ లలితోరుల కాంతి రంభ నీ శ్రీకరబాలలీల శశిరేఖయు నీరసవృత్తిఁ జెందుటన్ నీ కెనరారు దేవతరుణీమణులయినను సుందరీమణీ!
6
vutpalamaala
3997
_x000D_ జనుఁడు తెలివినొంద చంచలింపదు మది _x000D_ దయయు దైవమొగిని దగులు బుద్ధి _x000D_ తివురుభానుఁ జూచి తిమిరంబు నిలుచునా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3488
_x000D_ నాదబిందుకళల నయమొంది యాత్మ _x000D_ యం దంటి చపలచిత్త మమర నిల్పి _x000D_ బ్రహ్మరంధ్రమునను బ్రబలిన యోగిరా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2404
నిత్యానిత్యము లెఱుఁగక నిత్యముఁ జేపట్టుబుధుల నిందించిన నా మృత్యువుపా లౌ మర్తుఁడు సత్యం బిది వినగదన్న సంపఁగిమన్నా!
1
kandamu
1729
శ్రీరుక్మిణీనాథ జితకోటిరతినాథ సుందరాకార సానంద శరణుసురయక్షకిన్నరవరమౌనిశుభకర నరకాంతకా పద్మనాభ శరణుజలధరనిభగాత్ర జలజాతదళనేత్ర పరమపవిత్ర గోపాల శరణునిర్మలగుణతోష నిజభక్తజనపోషక వివచోభూషప్రకాశ శరణు
3
seesamu
1639
మోద మెలర్పఁగా దనయమోహము చేతను బిప్పలద్రు నా- గాది ప్రతిష్ఠలెల్ల జనులందఱు సంతసమందఁ జేయుచో, బేదఱికం బదెంత మఱి బిడ్డలు గల్గినఁ జాలునంచు నా- పాదన జేయుచో నెపుడుఁ బల్కెడు తల్లినిఁ బోలరెవ్వరున్.
6
vutpalamaala
1853
వనజాక్షి నెరనీటు వగలు చూచిన మది నిలువ నోపగరాదు నీరజాక్షకనకాంగి నెమ్మెయికాంతి జూచినయపుడె తమి నిల్ప వశమౌనె దానవారిమగువ జిలిబిలి ముద్దుమాటలాలించిన నాశ మాన్ప దరంబె యమరవంద్యశిబ్బెంపుగుబ్బల చిత్రంబు జూచిన మోహంబు మానునే మోహనాంగ
3
seesamu
3276
_x000D_ చదువులఁ జదివినవారలు _x000D_ పదవిన్ని బొందంగ లేరు పరమార్థముగాఁ _x000D_ బెదవులఁ గదలక యుండిన _x000D_ మదిలో నది రాజయోగమహిమము వేమా.
1
kandamu
1897
వలరాజుమామ జక్కులరేనిచెలికానితలపువ్వు కలువల చెలిమికాడుఱిక్కలగమికాడు జక్కులపగవాడు వారధిపట్టి భావజునిమామతిమిరబృందంబుల దెగటార్చు మగవాడు వలమురిదాల్పుముద్దులమరందిగగనేభ మెక్కి వేగ చరించు రేరాజు విరహులపాలిటి వెడదచిచ్చు
3
seesamu
968
భూతలంబునఁ గలిదోషహేతుకమునఁ | బ్రబలురై రింకనేమి చెప్పంగవలయు భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
2
teytageethi
1201
పాపంబులందు నెక్కుడు పాపములు సుమీ! ధరిత్రి పై క్రోధగుణం బేపారు లోభమును నివి యేపురుషులఁ జెందఁగూడ దిలను గుమారా!
1
kandamu
2644
"అమ్మా! యయ్య!" యటంచునెవ్వరిని నేనన్నన్శివా! నిన్ను నే సుమ్మీ నీ మదిఁ తల్లిదండ్రులనటంచు న్జూడఁగాఁబోకు నా కిమ్మైఁ దల్లియు దండ్రియున్‌ గురుఁడు నీవేకాన సంసారపుం జిమ్మంజీకటిఁగప్పిన\న్‌ గడుపు నన్‌ శ్రీకాళహస్తీశ్వరా!
7
saardulamu
979
బోలెఁడు గందంబు బొమలదాఁకా మెత్తి | మెంటెఁ డీబూడిద ఒంట బామి రుదురాకపేర్లు జన్నిదములు మోఁకాలి | లాపున దిగయేసి యావుపాస- నానికి నేతిదారైనను దెమ్మంట | దాఁ బల్కునెడ నమేద్యాలటంట పచ్చాలు మాలయ్యపచ్చాలుననుకొంట | సంకలో కబ్బాలు సప్పుకొంట
3
seesamu
169
నీ శాంతి యంభోధి నిర్భరాంబువులు బా- ణముఖంబునకుఁ దెచ్చు నాఁడె తెలిసె నీ కోప మరి రావణైకానుజన్ము నా- నగరి రాజుగఁ జేయు నాఁడె తెలిసె నీ కీర్తి కపటదుర్నితుఁడౌ ధ్వాంక్షదా- నవు తప్పుఁ గాచిన నాఁడె తెలిసె నీయభిజ్ఞత యవినిందిత నీతన్వి- నగ్నినిఁ జొరు మన్న యపుడె తెలిసె
3
seesamu
1679
తలఁపున నున్న భావ మొకదారిఁ జెలంగఁగ వచ్చిరాని మా- టలు మఱి పల్కువేళఁ గడు ఠాయి జెలంగెడు శౌరిసత్కథా- కలితవినోదముల్ వినెడు కైవడిగా వడి నాలకించుచో ఫల మొనఁగూడెనంచు నుతిఁ బల్కెడు తల్లినిఁ బోలరెవ్వరున్.
5
champakamaala
1811
గజయాన వగమీర గదిసి నాథుని యెద కులుకుగుబ్బలచేత గ్రుమ్మి వేగబదపడి చేతుల వదలక బిగబట్టి గుదిగాళ్లు వెన్నున గూర్చి వొక్కిమరుకేళి నొకవింత మనసిచ్చి యొక కొంతసేపు హాయిగ రతిచెంది మగనిమదికింపు పుట్టింప సదయుని మెప్పించి సుదతి నాథుని మోము జూచి తమిని
3
seesamu
2755
ఎప్పుడుఁ దప్పులు వెదకెడు నప్పురుషునిఁ గొల్వఁగూడ దది యెట్లన్నన్‌ సర్పంబు పడగ నీడను గప్ప వసించిన విధంబు గదరా సుమతీ!
1
kandamu
4344
శతకోటిసారస హితుల మించిన వెల్గు । మేరువు శిఖరంబుమీఁది వెల్గు మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల!
2
teytageethi
11
ఇంద్రనీలచ్ఛాయ లీను నెమ్మేనిపైఁ- గనకాంబరప్రభ గ్రందుకొనఁగఁ బర్వసుధాంశు శోభసముజ్జ్వలవక్త్ర- మున నూర్ధ్వపుండ్రము ముద్దు గుల్క నెగుభుజంబుల ధగద్ధగితాంగద ద్యుతుల్‌- మూర్ధరత్నకిరీటమునఁ జరింప వర్ణితోరస్థలి వైయంతిక కౌస్తు- భాంతర శ్రీదేవియంద మమర
3
seesamu
3788
_x000D_ కొట్టినఁ దిట్టినఁ గాని _x000D_ కట్టు బిగించినను గాని కరకరి సేయ\న్‌ _x000D_ కట్టడివడి యన కుండును _x000D_ దిట్ట మదిని శివుని దలఁప దీరదు వేమా.
1
kandamu
445
కాని ప్రయోజనంబు సమకట్టదు తా భువి నెంత విద్యవాఁ డైనను దొడ్డరాజు కొడుకైన నదెట్లు; మహేశుపట్టి వి ద్యానిధి సర్వవిద్యలకు, దానె గురుండు వినాయకుండు దా నేనుఁగు రీతి నుండియు నదేమిటి కాడఁడు పెండ్లి? భాస్కరా!
6
vutpalamaala
1991
అల నీటం దగురొంపిపైఁ జిలికిన న్నానీటనే పాయు నా యిల పాపంబులు దుర్భరత్వము మహాహేయంబునం బొందినం బలువై జీవుని దొప్పఁదోఁగినవి యీబాహ్యంబునం బాయునే పొలియుం గాక భవత్సుపాదజలముం బ్రోక్షింప నారాయణా!
4
mattebhamu
1398
సమయమెరుగని పనులివి సరసమగునె । పరులు గనుగొన్న నగరె మీ పనులటంచు కసరి నలుగుడునాటి చక్కన దలంప । వశమటే రామరామ లావణ్యసీమ.
2
teytageethi
1068
సద్గురుకృపాకటాక్షవీక్షణము వలన | బ్రాకృతుఁడు జ్ఞానియై ముక్తిపదము గాంచు, భూనుతవిలాస, పీఠికాపురనివాస, | కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!
2
teytageethi
4199
_x000D_ వాడవదినెకేల వావివర్తనములు _x000D_ చాడివాని కేల జాడబుద్ధి _x000D_ మూఢసతులకేల ముదముతో జ్ఞానంబు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2955
నెన్ని సొమ్ములునైన నేనిత్తు నీకు | నా పతిని జూచినంతనె నయముమీఱతరుణి నీవేగి యిచటికి తాడిమళ్ళ | రాజగోపాలు దేగదే రాజవదన.
2
teytageethi
4316
కదిసిన సేసము తైముల కంఠసరుల్‌ ఘనరత్న కంకణాం గదరశనా ... ... నికాయము శ్రీయలమేలుమంగకు\న్‌ బొదివి వివాహవేళ దిగఁ బోసిన ముత్తెపుఁ బ్రాల నందమై ముదమగు నీకుఁ గన్నుఁగవ ముందఱ నెప్పుడు వేంకటేశ్వరా!
5
champakamaala
4588
సురవరమల్ల! మల్లవిత సూత్రసుధాంబుధిఖేల! ఖేలసం గర కలకంఠ! కంఠమణినాయకభీమభుజంగ! జంగమ స్థిరతరనాథ! నాథక నిధీకృతరూప! విరూప సమ్మతా వర! కరుణాబ్ధి! ప్రోవు బసవా! బసవా! బసవా! వృషాధిపా!
5
champakamaala
1348
కులికి దిగ్గున లేచి లోకొంగు జూచి । చెరగు మాసె నటంచును సిగ్గుదోచి పాత్ర గైకొన్న హొయలెంచి బాళి నిలుప । వశమటే రామరామ లావణ్యసీమ.
2
teytageethi
3891
_x000D_ తనలో సర్వంబుండఁగ _x000D_ తనలోపల వెదుకలేక ధరవెదకెడు నీ _x000D_ తనువుల మోసెడి యెద్దుల _x000D_ మనములఁ దెల్పఁగ వశమె మహిలో వేమా.
1
kandamu
2903
నీ కటిపెంపుచేత ధరణీతలమున్ వశమయ్యె కోమలీ నీ కుచకుంభయుగ్మమున నిర్జితమయ్యె సురాలయం బహో చేకొనఁగల్గె నీదు జడచే నహిధామము నిన్నుఁ గూడి ము- ల్లోకము లేలినట్లు మదిలో ముదమందుదు సుందరీమణీ!
6
vutpalamaala
1691
సదమలరీతు లుల్లసిల సార మెఱింగెడి రీతిఁ జక్కఁగాఁ జదివితివేని భూజనులు సన్నుతి చేసెద రింతెకాక సం- పద లెడఁగూడు నీ కనుచు బాలునకు న్మఱి బుద్ధి చెప్పుచో మది ముదమంది యొప్పెసఁగు మానినిఁ దల్లినిఁ బోలరెవ్వరున్.
5
champakamaala
2429
భ్రమదృశ్యజాల మెల్లను భ్రమ లోకములెల్ల మిగుల భ్రమ కర్మంబున్‌ భ్రమమూలమె యీసర్వము సమరసమౌ దత్త్వ మెన్న సంపఁగిమన్నా!
1
kandamu
4253
కుంకుమకస్తురీ ప్రభ బుగుల్కొనఁ జెక్కుల జాఱ దివ్యతా టంకమణిప్రభాప్రతివిడంబముతో నలమేలుమంగ భ్రూ జంకెల నందలింపఁగనె జల్లనెఁ జిత్తము నీకు నంతలో నంకన మించు మిమ్ముఁ బులకాంకురకోటులు వేంకటేశ్వరా!
6
vutpalamaala
4623
భీమగజంబు డీకొనిన బిట్టరఁజంపుడు బిజ్జలేంద్రుఁడు ద్దామతఁ దక్కి మ్రొక్కుటయుఁ దత్కరినెత్తిన విక్రమోద్ధతుం డా మడివాలు మాచయకు నగ్గలమైన మహానుభావ! నా స్వామివి నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా!
6
vutpalamaala
2409
జడివాన కురిసినట్టులు విడువక వాదింతు రాత్మవేత్తల మనుచున్‌ గుడియెడ మెఱుఁగనిమాటల జడమతు లిలఁ గొంద ఱన్న సంపఁగిమన్నా!
1
kandamu
3299
_x000D_ వెదకి కానలేఁడు వేదాంతవేద్యుని _x000D_ తత్వవేత్తలేఁడు ధరణిలోనఁ _x000D_ గలిగెనేని యతఁడు కనఁబోఁడు మఱివేఱె _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3833
_x000D_ పూర్ణమైన తనదు భుజబల్మిఁ జూడక _x000D_ భువిని చెడుగుతోడ పోరరాదు _x000D_ పాలకుండ కింత పొలసినా సారాయి _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2230
అమరేంద్రవినుత! నిన్ననుసరించినవారు - ముక్తిఁ బొందిరి వేగ ముదముతోడ నీ పాదపద్మముల్‌ నెఱ నమ్మియున్నాను - నాకు మోక్షంబిమ్ము నళిననేత్ర! కాచి రక్షించు నన్‌ గడతేర్చు వేగమే - నీ సేవకునిఁ జేయు నిశ్చయముగఁ గాపాడినను నీకుఁ గైంకర్యపరుఁడనై - చెలఁగి నీ పనులను జేయువాఁడ
3
seesamu
2795
ధనపతి సఖుఁడై యుండియు నెనయంగా శివుఁడు భిక్ష మెత్తఁగవలసెన్‌ దనవారి కెంత కలగినఁ దనభాగ్యమె తనకుఁగాక తథ్యము సుమతీ!
1
kandamu
2082
ఉర్విలో నాయుష్యమున్న పర్యంతంబు - మాయ సంసారంబు మఱగి నరుఁడు సకల పాపములైన సంగ్రహించును గాని - నిన్నుఁ జేరెడి యుక్తినేర్వలేఁడు తుదకుఁ గాలునియొద్ద దూత లిద్దఱు వచ్చి - గుంజుక చనివారు గ్రుద్దుచుండ హింస కోర్వఁగలేక యేడ్చి గంతులువేసి - దిక్కు లేదని నాల్గుదిశలు చూడఁ
3
seesamu
3617
_x000D_ జాతులందు మిగుల జాతి యే దెక్కువో _x000D_ యెఱుక లేక తిరుగు నేమిఫలము _x000D_ ఎఱుక గలుగువాఁడె హెచ్చైన కులజుండు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3732
_x000D_ యోనియందె పుట్టి యోనికి రుచిఁజేయు _x000D_ చన్నుగుడిచి పెరిగి చన్నుఁబట్టు _x000D_ సృష్టిలోన నడఁగు సిగ్గెఱుగని జీవి _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
1196
విను ప్రాణరక్షణమునన్‌ ధనమంతయు మునిగిఁపోవు తఱిఁ బరిణయమం దున గురుకార్యమున వధూ జన సంఘములందు బొంకఁ జనును గుమారా!
1
kandamu
2298
సకృపాలోకన! నందగోపుని తనూజాతుండవై గొల్లవై సకలక్షోణుల నేలినాఁడవఁట, మించం గశ్యపబ్రహ్మ గ న్న కుమారుండన మిన్నుముట్టి కుఱుచై నాఁడేల నాడేల నే రక దానంబుగ వేఁడుకొంటి రఘువీరా! జానకీనాయకా!
4
mattebhamu
4090
_x000D_ ద్రోహబుద్ధినైన దొంగఱికమునైన _x000D_ నటననైన సాహసముననైన _x000D_ సంపదధికునుండి సాధించి ధనమును _x000D_ బడుగు కిచ్చి బాగుపడును వేమ.
0
aataveladi
584
సరయువు గృష్ణ నర్మదయు జాహ్నవి బాహుద తుంగభద్ర భా- స్కరసుతయు న్సరస్వతియు గౌతమియుం మొదలైన దివ్యని- ర్ఝరులను మున్గు పుణ్య మొకసారె శివా యనినన్ లభించుఁబో చిరవిభవా! భవా! విజితచిత్తభవా! యభవా! మహాభవా!
5
champakamaala
1560
అతిసూక్ష్మాంగుఁడ వీవు ననుఁ గొని యీయంభోనిధిం దాటి యే గతి పోవంగలవంచు సీత పలుకం గౌతూహలం బొప్ప న ప్రతిమానామర శైలసన్నిభ శరీరం బర్మిలిం జూపి యా క్షితికన్యామణి కద్భుతంబు ముదముం గీల్కొల్పవే మారుతీ!
4
mattebhamu
2430
వంశము తన కెక్కడిది చి దంశము లౌఁ గాకయున్నఁ గద జీవులకున్‌ సంశుద్ధి దొరకనేరదు సంశయములు విడువకున్న సంపఁగిమన్నా!
1
kandamu
256
అదన న్వేఁడిన యాచకప్రతతి కీయంగావలెన్ రొక్కమిం- పొదవన్ మీ కథలాలకింపవలె మేనుప్పొంగ గంగామహా- నదిలో స్నానము లాచరింపవలె హీనప్రక్రియ న్మాని స- మ్మదచిత్తంబున మర్త్యుఁడెల్లపుడు రామా! భక్తమందారమా!
4
mattebhamu
3754
_x000D_ కాలు చేయి లేదు కంచుకంబు గలదు _x000D_ కొమ్మ లేదు ఉరికి చిమ్ము వేగ _x000D_ గరిడిలేక చంపుఁగడు పెద్దచోద్యమౌ _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
766
ధరలో గోళకుఁ డైనపాండునికళత్రం బందు వేర్వేఱనే వురకు\న్‌ బుట్టినపాండునందనులు దివ్యుల్మెచ్చ వర్తింపఁ ద చ్చరితం బంతయు భారతంబని ప్రశస్తంబయ్యె నీనామసం స్మరణప్రౌఢిమఁ గాదె యీఘనత కృష్ణా దేవకీనందనా.
4
mattebhamu
2645
కొడుకుల్‌ పుట్టరటంచు నేడ్తురవివేకు ల్జీవనభ్రాంతులై కొడుకుల్‌ పుట్టరె కౌరవేంద్రున కనేకుల్‌ వారిచే నేగతుల్‌ వడసెం బుత్త్రులులేని యా శుకునకున్‌ బాటిల్లెనే దుర్గతుల్‌ చెడునే మోక్షపదం బపుత్త్రకునకున్‌ శ్రీకాళహస్తీశ్వరా!
4
mattebhamu
845
అంసాలంబితకుండల కంసాంతక నీవు ద్వారకాపురిలోన\న్‌ సంసారి రీతినుండి ప్ర శంసార్హుఁడ వైతి వహహ జగతిని గృష్ణా.
1
kandamu
4510
ప్రబలపాతకపూర్ణుఁ డల్పంపు సుకృత- । మునను శుద్ధుండు గాకుండుననుట నిక్క- మాడు గాకేమి యిచ్చకం బనృతవాది మదరిపువిఫాల మునిజనహృదయలోల । వేణుగోపాల భక్తసంత్రాణశీల!
2
teytageethi
3167
_x000D_ శివుని యనుభవంబు సృష్టిలోపల లేక _x000D_ సంశయంబు చెడదు సాధకులకు _x000D_ చెలగుఁదివ్వె లేక చీఁకటిపాయునా? _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3154
_x000D_ సత్య మమరియుండ జ్ఞాన మమరియుండు _x000D_ జ్ఞాన మమరియుండ సత్యముండు _x000D_ జ్ఞానసత్యములును సమమయిన ద్విజుఁడగు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
953
దశశతాబ్దముల నిన్ దవిలి పూజించిన | మెచ్చి చక్రికిఁ జక్రమిచ్చినావు తరలక నిను గూర్చి తప్పమొనర్చిన క్రీడి | కెసఁగఁ బాశుపతాస్త్ర మొసఁగినావు మిత్తి చేఁ బడి నిన్ను హత్తి బత్తిఁ దలంచు | మునిపుత్రుఁ జేపట్టి మనిచినావు కాలకూటాగ్నిచేఁ గ్రాఁగి కుయ్యిడుచున్న | దివిజుల యాపదన్ తీర్చినావు
3
seesamu
1708
పరనిరతోపకారమృదుభాషణభూషణుఁ డాశ్రితావన- స్థిరగుణశాలి నీతిపథజీవనజీవనుఁ డుత్తమాధమాం- తరము లెఱుంగు మేటి తలిదండ్రులకు న్జవదాఁటఁడన్నచో నరసి మనంబులోన ముదమందెడు తల్లినిఁ బోలరెవ్వరున్.
5
champakamaala
2628
వీడెంబబ్బినయప్పుడుం దమ నుతుల్విన్నప్పుడుం బొట్టలోఁ గూడున్నప్పుడు శ్రీవిలాసములుపైకొన్నప్పుడుం గాయకుల్‌ పాడంగా వినునప్పుడు\న్‌ జెలగు దంభప్రాయవిశ్రాణన క్రీడాసక్తుల నేమి చెప్పవలెనో శ్రీకాళహస్తీశ్వరా!
7
saardulamu
1134
బూటకపు వర్తనముఁ గని, జూటరి వీఁడనుచుఁ దప్పఁ జూతురుగా! యా బాటను విడి సత్యము మది పాటించి నటించువాఁడె నరుఁడు కుమారా!
1
kandamu
1784
... ... ... ...యట్టి విరిబోడి నేలుట యర్హమగును | మదనగోపాల సత్యభామావిలోల!
2
teytageethi
462
తనకు ఫలంబు లేదని యెదం దలపోయఁడు కీర్తి గోరు నా ఘన గుణశాలి లోకహిత కార్యము మిక్కిలి భారమైన మే లనుకొని పూను; శేషుఁడు సహస్ర ముఖంబుల గాలి గ్రోలి తా ననిశము మోవఁడే మఱి మహాభరమైన ధరిత్రి భాస్కరా!
5
champakamaala
1268
చెప్పినఁ జెప్పక యుండినఁ దప్పక సేయంగవలయుఁ దనపనులెల్లన్‌ మెప్పొదవఁగాను లేదా ముప్పొదవును గాదె యెందు ముద్దు కుమారీ!
1
kandamu
4427
పూపొదలో దాఁగి పులి యున్నరీతిని । మొగిలిరేకున ముండ్లు మొలచినట్లు నందనవనములో నాగుఁబామున్నట్లు । చందురునకు నల్పు చెందినట్లు సొగసైన లేమకు సెగరోగమున్నట్లు । మృగనాభిలోఁ బిప్పి తగిలినట్లు జలధిలోన విషంబు సంభవంబైనట్లు । కమలాప్తునకు శని గలిగినట్లు పద్మరాగమునకుఁ బటలమేర్పడినట్లు । బుగ్గవాకిటి చుట్టు పుట్టినట్లు
3
seesamu
3295
_x000D_ ఇంతకాలముండి యెఱుకమాలినజీవి _x000D_ చచ్చిపుట్టుచుండు సహజమనుచు _x000D_ నెఱుక మఱచుచోట నెఱుఁగునా బ్రహ్మంబు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2468
పాపపువాసనవిషయము కాపాడుచురాగ నరుఁడు గడఁవగఁగలఁడా? యేపట్టున గుహ్యోదర చాపల్యము మానకున్న సంపఁగిమన్నా!
1
kandamu
3845
_x000D_ ఎట్టిరూపుఁ జూడ నీరూపు కనిపించు _x000D_ నీదురూపుఁజూడ నెగడుఁ దెలివి _x000D_ హెచ్చు తెలివి యున్న నీశ్వరుఁ డేతోఁచు _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
316
శుక శాండిల్య మృకండుజాత్రి కలశీసూనుల్ భరద్వాజ శౌ- నక వాల్మీకి వసిష్ఠ గర్గ భృగు మాండవ్యాజసంభూత కౌ- శిక కణ్వాది మహర్షిశేఖరులు నిన్ జింతింపఁగా లేరు, కొం- కక నేనెంతటివాఁడ నిన్బొగడ భర్గా! పార్వతీవల్లభా!
4
mattebhamu
4280
దొరలిన మేనిగందపొడిధూళి వసంతము ఘర్మవారిపైఁ జఱచినపువ్వుఁదేనెల వసంతము నీ కలమేలుమంగకున్‌ నెఱసి కరంగు చిత్తముల నీళ్లవసంతము మీకు మీకు నీ యొఱపులు నీప్రియంబులు మహోన్నతు లెట్టివో వేంకటేశ్వరా!
5
champakamaala
27
తగునట్లు తిరుమేను తా నామతింపుచు- మిన్న పీతాంబరం బున్న దనుచుఁ గమలతోఁ బుట్టిన కౌస్తుభం బది పోవఁ- దక్కు సొమ్మది నీకు తక్కె ననుచు లలితరత్న ద్యుతి మొలచినట్లు కిరీట- ముత్తమాంగముఁ బాయ కున్న దనుచు మండితమాణిక్యకుండలంబులు కర్ణ- యుగళితోఁ బుట్టిన ట్లున్న వనుచు
3
seesamu
2336
ధర కల్పాంతమునం గరంగఁబడి పాతాళంబులోనంటినన్ దొరయం దొల్లిటియట్ల కా నిలుప నుద్యోగించి క్రోడంబవై పొరి నబ్భూతలమెత్తినట్టి ఘనదర్పున్ నిన్ను భావింతు ని ర్భరకారుణ్య నిరూఢచిత్త! రఘువీరా! జానకీనాయకా!
4
mattebhamu
4062
_x000D_ అధికజనులతోడ నాప్తులతోడను _x000D_ పరువు గురు తెఱింగి పలుకకున్న _x000D_ వచ్చు చెడ్డతనము హెచ్చుగా గాంభీర్య _x000D_ హానిచెందుఁ దనకు నపుడు వేమ.
0
aataveladi
3074
నిన్నుఁ జూచె నేని తన్నుఁ దా మఱచును తన్నుఁ జూచె నేని నిన్ను మఱచు; నే విధమున జనుఁడు నెఱుగు, నిన్నును దన్ను? విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
2580
భవదుఃఖార్ణవయానపాత్రము పరబ్రహ్మంబు యోగీంద్రహృ- ద్భవనప్రస్ఫురితప్రదీపము నఘధ్వాంతార్కబింబం బతి- శ్రవణానందకరంబు సన్మునిగణస్వాధ్యాయపాఠంబు మీ శివనామాంకము భక్తపుంగవ సదా సేవ్యంబు సర్వేశ్వరా!
4
mattebhamu
880
క్రతువులు తీర్థాటనములు వ్రతములు దానములు సేయ వలెనా లక్ష్మీ పతి మిముఁ దలచినవారికి నతులితపుణ్యములు గలుగు టరుదే కృష్ణా.
1
kandamu
1227
పతి భుజియించిన పాత్రను మెతు కొక్కటియైన భార్య మెసఁగుటకై తా హిత మూనకున్న నది యొక సతియే? కడుఁ బాపజాతి జగతి కుమారీ!
1
kandamu
1411
మగవారి మాట బూరగపంటి తేటద్ద- । మున గానబడు పైడిమూట దూర- మగు కొండనున్పు లేనుగదిన్న వెలగకా- । యలు మబ్బులో తళుక్కనెడి మెరుపు మిద్దెపై పరుగులు మీసాలపై తేనె । పొగ ముల్లెగట్టిన పోల్కె తేట- నీటిలో జాబిల్లినీడ లేగిన యెండ- । మావులు రతివేళ మరులు సతుల
3
seesamu
1696
సరసులు మెచ్చఁగా గణితశాస్త్రము నేరిచి సంఖ్యలెల్ల సు- స్థిరమతితోడఁ జెప్పుటకుఁ దెల్వి వహించినయట్టి మంచిలే- కరి యగుఁగాక నా సుతశిఖామణి యంచుఁ బరాపరేశు స- ద్గురునిఁ దలంచుచో నెదను గోరెడు తల్లినిఁ బోలరెవ్వరున్.
5
champakamaala
2711
ఆరావంబుదయించెఁ దారకముగా నాత్మాభ్రవీధిన్మహా కారోకారమకార యుక్తమగునోంకారాభిధానంబు చె న్నారు న్విశ్వమనంగఁ దన్మహిమచే నా నాదబిందుల్సుఖ శ్రీ రంజిల్లఁగడంగు నీవదె సుమీ శ్రీకాళహస్తీశ్వరా!
7
saardulamu
3612
_x000D_ వానరాకడ మఱి ప్రాణంబు పోకడ _x000D_ కానఁబడదు ఘనుని కైనఁగాని _x000D_ కానఁబడిన మీఁద కలి యిట్లునడుచునా _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
3014
తప్పక లక్ష్మణుఁ దడయక గాపిడి యేగి మృగమ్మును నేయుతరినిహా లక్ష్మణా యని యా మృగమటు గూయ మగువకు దుఃఖమై మరిది నంపెమారీచు మాటయే మా యన్న గాదని భావించి తమ్ముడు బాసచేసెనాడగూడని మాటలాడగా దలపెట్ట వనితరో తమ్ముడు వచ్చినాడు
3
seesamu
3044
చిన్నతనమ్మున జిన్నవాండ్రను గూడి బాగుగానుందువే పరమపురుషయవతారమూర్తివం చలివేణులందరున్ భ్రాంతిచేతను నిన్ను బ్రస్తుతింపనా లక్ష్మితోడుత నానందముగ గూడి పొందుగా నుంటివే సుందరాంగరమణులందఱు గూడి రవ్వలు బెట్టిన చెట్ల నెక్కుట నీకు చెల్లమగునె
3
seesamu
21
భక్తిఁజేసిన శిలాప్రతిమ మాత్రమే కాని- హరి యిందుఁ గలుగునా యనెడువారు స్వామి యిం దుండిన సత్యంబుఁ జూపక- యుండునే యని పల్కుచుండువారు బుద్ధావతారంబుఁ బూనినాఁ డఖిలంబుఁ- గని కనన ట్లుండు ననెడువారు దేవతామహిమంబు దెలియునో యేమేమి- నడువ నున్నదో యని నుడువువారు
3
seesamu
3441
_x000D_ సిగ్గునేడనుదాగుఁ జీక టేడను దాగు _x000D_ నాఁకలేడదాగు నాత్మలోన _x000D_ దాగియున్న నిద్ర దాగుట తెలియుఁడీ _x000D_ విశ్వదాభిరామ వినర వేమ.
0
aataveladi
End of preview. Expand in Data Studio

ChandassuMeterClassification

Single-label Telugu poetic meter (chandassu / type) classification for PoetryMTEB, derived from the Chandassu corpus (Kaggle / Mendeley / Hugging Face; local Chandassu_Dataset.csv).

Dataset Card

Item Description
Source Kaggle; Mendeley Data (DOI: 10.17632/46wrt7v53c.1); Hugging Face; paper arXiv:2510.01233
Languages Telugu (te)
Size train=3721; test=930 (no validation)
Classes 8 meters (type field)
Splits Stratified ≈ 80% / 19% by meter, with cross-dataset anti-leakage vs PoetryMTEB/Padyam2GadyamMeterClassification
License MIT (same as upstream)
Evaluation metrics Classification on embeddings: accuracy, macro/weighted F1

Cross-dataset split constraint

Relative to PoetryMTEB/Padyam2GadyamMeterClassification:

  1. Chandassu train does not contain poems that appear in Padyam test
  2. Chandassu test does not contain poems that appear in Padyam train

Matching uses whitespace-normalized poem text. Forced assignments:
Padyam-train overlaps → Chandassu train (20 poems);
Padyam-test overlaps → Chandassu test (6 poems).

Verified after split: chandassu_train ∩ pady_test = 0, chandassu_test ∩ pady_train = 0.


Features

Field Type Description
id string Example id
poem string Telugu poem (raw_padyam_text)
label int64 Meter class index
label_name string Meter type (romanized), e.g. kandamu

Codebook: label_taxonomy.json.

Labels

id label_name gloss count
0 aataveladi Āṭaveladi / ఆటవెలది (戏舞体) 995
1 kandamu Kandam / కందం (坎达体) 683
2 teytageethi Tēṭagīti / తేటగీతి (澄歌体) 676
3 seesamu Sīsamu / సీసము (席萨体) 672
4 mattebhamu Mattebhamu / మత్తేభము (醉象律) 617
5 champakamaala Champakamāla / చంపకమాల (瞻波迦鬘) 389
6 vutpalamaala Utpalamāla / ఉత్పలమాల (优钵罗鬘) 329
7 saardulamu Śārdūlamu / శార్దూలము (虎律) 290

Construction method

  1. Load local Chandassu_Dataset.csv / upstream Chandassu.
  2. Load PoetryMTEB/Padyam2GadyamMeterClassification train/test poems; force overlapping Chandassu rows into compatible splits (anti-leakage).
  3. Stratified train/test split of remaining rows by type (seed=42).
  4. Map type → contiguous label ids (frequency-descending).

How to load

from datasets import load_dataset

ds = load_dataset("PoetryMTEB/ChandassuMeterClassification")
print(ds["test"][0]["label_name"], ds["test"][0]["poem"][:60])

License

Distributed under the MIT License, consistent with the upstream Chandassu release.


Citation / provenance

@misc{pavan2025computationalsociallinguisticstelugu,
      title={Computational Social Linguistics for Telugu Cultural Preservation: Novel Algorithms for Chandassu Metrical Pattern Recognition}, 
      author={Boddu Sri Pavan and Boddu Swathi Sree},
      year={2025},
      eprint={2510.01233},
      archivePrefix={arXiv},
      primaryClass={cs.CL},
      url={https://arxiv.org/abs/2510.01233}, 
}
Downloads last month
-

Paper for PoetryMTEB/ChandassuMeterClassification